Rachana Maurya: హాట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న పవన్ ఐటమ్ సాంగ్ బ్యూటీ రచన మౌర్య!

పవన్ కళ్యాణ్ సినిమాలలో ఫ్లాప్ తెచ్చుకొని కూడా కలెక్షన్స్ పరంగా ఎబోవ్ యావరేజి అనిపించుకున్న చిత్రం ‘బంగారం’. తమిళ స్టార్ డైరెక్టర్ ధరణి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2006 సమ్మర్ కానుకగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలకు ముందే పాటల ద్వారా మంచి క్రేజ్ దక్కించుకుంది. ముఖ్యంగా ‘రా రా బంగారం’ సాంగ్ అప్పట్లో ఒక సెన్సేషన్. ఈ పాట తర్వాత ‘మారో మస్తీ మారో’ మరియు ‘చెడుగుడు అంటే భయం’ అనే పాటలు కూడా రెండు తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపేసాయి.

సినిమా మీద మితిమీరిన అంచనాలు పెరగడం తో మొదటి రోజు మొదటి ఆట నుండే టాక్ రాలేదు, కానీ ఓపెనింగ్స్ పరంగా ఆల్ టైం డే 1 రికార్డు, అలాగే ఆల్ టైం ఫస్ట్ వీక్ రికార్డ్స్ వచ్చాయి. ఫుల్ రన్ లో 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా లోని సెన్సషనల్ హిట్ పాట గా నిల్చిన ‘చెడుగుడు అంటే భయం’ అనే పాటలో పవన్ కళ్యాణ్ తో ఆడిపాడిన హాట్ బ్యూటీ అందరికీ గుర్తుకి ఉండే ఉంటుంది.

ఈమె పేరు (Rachana Maurya) ‘రచన మౌర్య’. ఈమె తెలుగు, హిందీ , తమిళం, కన్నడ మరియు మలయాళం బాషలలో ఐటెం సాంగ్స్ చేస్తూ మంచి పాపులారిటీ ని సంపాదించింది. మధ్యలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మోడలింగ్ రంగం లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఈమె, ‘దస్’ అనే హిందీ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది.

2013 వ సంవత్సరం వరకు యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చిన ఈమె, ఆ తర్వాత అకస్మాత్తుగా అదృశ్యమైంది.అటు సినిమాల్లో కనిపించలేదు, ఇటు సోషల్ మీడియా లోను కనిపించలేదు. అయితే ఈమె చాలా కాలం తర్వాత ఒక ఫోటో షూట్ ఇవ్వగా, దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus