Radhe Shyam Collections: డివైడ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ నే రాబట్టింది.. కానీ..!

Advertisement

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండీ దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత వచ్చిన ‘రాధే శ్యామ్’ చిత్రం నిన్న అంటే మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘గోపికృష్ణా మూవీస్’ సంస్థతో కలిసి ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ నిర్మించింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా కృష్ణంరాజు, భాగ్య శ్రీ, జగపతి బాబు, మురళీ శర్మ తదితరులు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.

Click Here To Watch Now

జస్టిన్ ప్రభాకరన్ సంగీతంలో రూపొందిన పాటలు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలెట్డు గా నిలిచాయి. మొదటి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కలెక్షన్ల విషయంలో పర్వాలేదు అనిపించింది.

మరీ ‘సాహో’ రేంజ్లో కాదు కానీ మంచి ఓపెనింగ్సే అని చెప్పాలి.

నైజాం 10.55 cr
సీడెడ్ 03.60 cr
ఉత్తరాంధ్ర 01.92 cr
ఈస్ట్ 02.55 cr
వెస్ట్ 02.00 cr
గుంటూరు 02.50 cr
కృష్ణా 0.92 cr
నెల్లూరు 01.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 25.12 cr
తమిళ్ నాడు   0.20 cr
కేరళ   0.10 cr
కర్ణాటక 03.10 cr
నార్త్ ఇండియా (హిందీ) 03.20 cr
ఓవర్సీస్  06.20 cr
రెస్ట్  02.40 cr
టోటల్ వరల్డ్ వైడ్  40.32 cr

‘రాధే శ్యామ్’ చిత్రానికి రూ.196.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్ కు రూ.200 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.40.32 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.159.68 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు డివైడ్ టాక్ రావడం, పైగా ‘సాహో’ కి దక్కినన్ని థియేటర్లు ఈ చిత్రానికి దొరక్కపోవడంతో మొదటి రోజు దాని స్థాయి వసూళ్ళను ఈ మూవీ రాబట్టలేకపోయింది. ఇలాగే స్టడీగా రాబడితే తప్ప.. బయ్యర్స్ భారీ నష్టాల నుండీ తప్పించుకునే అవకాశం లేదు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus