ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వైరస్ భయంతో విల విలలాడిపోతోంది. విదేశాల నుండీ ఎవరు వచ్చినా క్వారెంటైన్ కు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. ఇప్పుడైతే ఎవ్వరినీ సిటీ లేదా దేశాలు దాటనివ్వడం లేదనుకోండి. అందుకు గాను తెగ అల్లర్లు కూడా జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే… ఇప్పుడు నార్మల్ గా తుమ్మినా… దగ్గినా.. జనాలు కరోనా అనే భయపడుతున్నారు.
ఇదిలా ఉంటే… బాలీవుడ్ నటి రాధిక ఆప్టే కు కూడా కరోనా సోకింది అనే ప్రచారం ఊపందుకుంది. అది నిజం కాదు అని ఆమె తెలిపినా ఎవ్వరూ ఈ ప్రచారాన్ని ఆపడం లేదు.విషయం ఏమిటంటే… ఇటీవల ఈమె లండన్ కు వెళ్లింది. బ్రిటన్ మొత్తం కరోనా బారిన పడి అతలాకుతలం అయిపోతున్న వేళ ఈమె అక్కడి హాస్పిటల్ కు వెళ్లింది.
మాస్క్ ధరించి ఉన్న తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే దీంతో ఆమెకి కరోనా సోకింది అనే ప్రచారం మొదలైంది. అయితే ఈమె అసలు అక్కడి హాస్పిటల్ కు ఎందుకు వెళ్లింది. ‘నేను బాగానే ఉన్నాను.. కంగారు పడాల్సిందేమీ లేదు’ అని తెలిపింది. కాని అసలు ఎందుకు హాస్పిటల్ కు వెళ్లింది..? రాధిక ఆప్టే తెలుపలేదు.