Raghava Lawrence: లోకేష్, నెల్సన్ సినిమాలు సక్సెస్ అవ్వడానికి అదే కారణమా?

  • October 10, 2023 / 01:40 PM IST

కోలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగాను కొరియోగ్రాఫర్ గాను అలాగే నటుడిగాను ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రాఘవ లారెన్స్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తే బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఈయన రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం పలు సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి లారెన్స్ తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకులు అయినటువంటి లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ ఇద్దరు డైరెక్టర్లు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ దర్శకుల డైరెక్షన్లో తాజాగా వచ్చినటువంటి సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఇలా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ఫుల్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నటువంటి వీరిద్దరి గురించి లారెన్స్ మాట్లాడుతూ నెల్సన్ లోకేష్ సినిమాలు చాలా రొటీన్ కథలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయి అంటూ కామెంట్స్ చేశారు.

వీరి సినిమాలలో కథకు పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ స్క్రీన్‌ప్లే డిఫరెంట్‌గా ఉండటంతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ లను భారీగా తెరకెక్కించేందుకు లోకేష్ కనకరాజ్‌, నెల్సన్‌ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఆ స్టైల్ వారికి విజయాల్ని తెచ్చిపెడుతుందని లారెన్స్ అన్నాడు. జిగర్‌తాండ డబుల్ ఎక్స్ సినిమాతో తాను వారి స్టైల్‌నే ఫాలో కాబోతున్నట్లు లారెన్స్ చెప్పాడు

ఈ సినిమా ద్వారా అసలు లారెన్స్ (Raghava Lawrence) అంటే ఏంటో మీ అందరికీ పరిచయం చేస్తాను అంటూ ఈ సందర్భంగా లోకేష్ నెల్సన్ సినిమాల గురించి మాట్లాడుతూ ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus