‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై దర్శకేంద్రుడి కామెంట్స్ వైరల్!

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) .. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), శ్రీదేవి (Sridevi) కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ. కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై సి.అశ్వినీదత్  (C. Aswani Dutt)  నిర్మించారు. 1990 మే 11న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా రిలీజ్ రోజున తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి.

Raghavendra Rao

అయినా సరే జనం ఆ వర్షాలు, వరదలు వంటి వాటిని లెక్కచేయలేదు. థియేటర్లలో మోకాళ్ళ వరకు నీళ్లు వచ్చినా జనం సినిమాని ఎంజాయ్ చేయడం చెప్పుకోదగ్గ విషయం. ఇలాంటి గౌరవం అందుకున్న ఏకైక సినిమాగా కూడా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ నిలిచింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా సీక్వెల్ లేదా రీమేక్ వస్తే బాగుణ్ణు అని మెగా అభిమానులు భావిస్తున్నారు. రాంచరణ్ తో ఈ సీక్వెల్ చేస్తే బాగుంటుంది అని కూడా అశ్వినీదత్ అనుకున్నారు.

కానీ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకి (Raghavendra Rao)  ఈ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్ట్ లేనట్టు తెలిపి షాకిచ్చారు. ఎందుకంటే ‘చిరంజీవిలా చరణ్ కరెక్ట్ గా అవుతారు. కానీ శ్రీదేవిలా జాన్వీని జనాలు యాక్సెప్ట్ చేయడం కష్టం’ అంటూ కె.రాఘవేంద్రరావు ఇటీవల ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ రీ రిలీజ్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు. ఆయన చెప్పింది నిజమే. దేవకన్యలా శ్రీదేవి కరెక్ట్ గా సెట్ అయ్యింది. కానీ జాన్వీలో (Janhvi Kapoor) ఆ కళ ఉండదు. ఆడియన్స్ కూడా దర్శకేంద్రుడి కామెంట్స్ కు ఏకీభవించాల్సిందే.

ఆపరేషన్ సిందూర్.. టైటిల్ కోసం డిమాండ్ పెరిగిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus