కాస్త షాకింగ్ న్యూస్ లా మెగా అభిమానుల్ని షేక్ చేసినా ఈ వార్త వందశాతం నిజమనే వాదన కాస్త గట్టిగా వినిపిస్తోంది. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా విడుదలైన మోషన్ పోస్టర్ లో సంగీతం ఎ.ఆర్.రెహమాన్ అని ఎనౌన్స్ చేశారు. బాగానే ఉంది కానీ.. ఈ విషయాన్ని రెహమాన్ తన ఫేస్ బుక్ లేదా ట్విట్టర్ ఎకౌంట్స్ లో కన్ఫర్మ్ చేయకపోవడం కనీసం సదరు మోషన్ పోస్టర్ ను షేర్ చేయకపోవడం గమనార్హం.
అయితే.. లేటెస్ట్ డవలప్ మెంట్ ప్రకారం “సైరా నరసింహారెడ్డి” ప్రొజెక్ట్ నుంచి రెహమాన్ వాకవుట్ చేసినట్లు టాక్. సురేందర్ రెడ్డి శైలి నచ్చలేదో లేక మరింకేదో కారణమో తెలియదు కానీ.. “ఈ సినిమా నేను చేయలేను” అంటూ రెహమాన్ బయటకొచ్చేశాడట. ఇప్పుడు సైరా బాధ్యత తమన్ పై పడే అవకాశాలున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో.. అబద్ధమెంతో తెలియదు కానీ.. ఈ వార్తలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.