Raid2: మిస్టర్ బచ్చన్ కథకు సీక్వెల్ వచ్చింది.. టీజర్ చూశారా?

బాలీవుడ్‌లో 2018లో వచ్చిన రెయిడ్ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. ఐఆర్‌ఎస్ అధికారి పాత్రలో అజయ్ దేవగణ్ (Ajay Devgn) పోషించిన రోల్‌కి అప్పట్లో మంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్‌గా రూపొందుతున్న రెయిడ్ 2 టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ చూస్తే మళ్లీ ఓ న్యాయపరమైన డ్రామా, పవర్ఫుల్ పాత్రల మధ్య తలపడే కథ తెరకెక్కబోతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఈసారి అజయ్ దేవగణ్ పాత్ర మరింత బలంగా కనిపిస్తోంది.

Raid2

“నా సర్వీసులో 74 రెయిడ్స్ చేశాను, 74 సార్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాను” అనే డైలాగ్‌తో టీజర్‌కు డెఫినిట్ టోన్ సెట్ అయ్యింది. ఇక ఈసారి విలన్‌గా రితేష్ దేశ్‌ముఖ్ కనిపించడం ప్రత్యేక ఆకర్షణ. స్టైలిష్ లుక్‌తో రాజకీయ నాయకుడిగా వచ్చిన రితేష్, అజయ్‌తో డైరెక్ట్ క్లాష్‌కు రెడీగా ఉన్నాడు. ఈ ముగ్గురు పాత్రల మధ్య వచ్చే తాకిడి డైలాగ్స్, బిల్డప్ సీన్స్, భారీ క్యాష్, ఇంటెన్స్ బీజీఎమ్‌తో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

తెలుగు ఆడియెన్స్‌కు ఈ టీజర్ చూసిన వెంటనే మిస్టర్ బచ్చన్ గుర్తొస్తోంది. గత ఏడాది హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెయిడ్ రీమేక్ అయినా, స్క్రీన్‌ప్లేలో చేసిన మార్పులు, మాస్ అంశాల జోడింపు ఒరిజినల్ ఎమోషన్‌ను దెబ్బతీశాయి. దీంతో రవితేజ నటించినప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అయితే బాలీవుడ్‌లో మాత్రం మేకర్స్ అసలైన కథకు న్యాయం చేస్తూ, విలన్ పాత్రను మరింత స్ట్రాంగ్ గా డిజైన్ చేశారు.

రెయిడ్ 2 టీజర్‌లో సౌరభ్ శుక్లా పాత్ర మళ్లీ కనిపించడం, జైలులో ఉండి కథను నెరేట్ చేయడం, గత భాగానికి కంటిన్యూషన్‌గా సినిమాను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు చూపిస్తుంది. మే 1న విడుదల కానున్న ఈ సినిమా పై బజ్ భారీగా నెలకొంది. రితేష్ దేశ్‌ముఖ్, అజయ్ దేవగణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మళ్లీ అదే మేజిక్ రిపీట్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus