Raj Kundra: నా చెల్లి భర్తతో ఎఫైర్ పెట్టుకుంది : రాజ్‌కుంద్రా

  • June 12, 2021 / 07:42 PM IST

ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా తన మొదటి భార్య కవిత గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కవితను 2003లో వివాహం చేసుకున్న రాజ్ కుంద్రా 2006లో ఆమెకి విడాకులు ఇచ్చాడు. అనంతరం 2009లో శిల్పాశెట్టిని వివాహం చేసుకున్నాడు. అయితే రాజ్ కుంద్రా తనతో విడిపోవడానికి కారణం శిల్పాశెట్టినే అంటూ అప్పట్లో కవిత ఆరోపణలు చేసింది. శిల్పా కోసమే తనను విడాకుల కోసం వేధించాడంటూ కవిత ఆరోపించింది.

తాజాగా ఈ విషయాలపై రాజ్ కుంద్రా క్లారిటీ ఇచ్చారు. కవితా చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని.. సెన్సేషన్ కోసం కవిత సెలబ్రిటీ అయిన శిల్పాశెట్టిపై నిరాధార ఆరోపణలు చేస్తుందని.. అందులో ఎలాంటి నిజం లేదని అన్నాడు. కవిత తన సోదరి భర్తతో సంబంధం పెట్టుకొని మోసం చేసిన కారణంగానే ఆమె నుండి విడాకులు తీసుకున్నానని స్పష్టం చేశాడు రాజ్ కుంద్రా. మరిన్ని వివరాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం. ”నా కుటుంబంతో కలిసి లండన్ లో ఉండేవాళ్లం.

అమ్మ, నాన్నలతో పాటు నా సోదరి, ఆమె భర్త కూడా ఉండేవారు. అప్పుడు కవిత నా సోదరి భర్తతో చాలా సన్నిహితంగా ఉండేది. అతనితో ఎక్కువ సమయం గడిపేది. నా కుటుంబంలో చాలా మంది చివరికి నా డ్రైవర్ కూడా వీరిద్దరి మధ్య ఏదో ఉందని నాకు చెప్పారు. కానీ నేనెప్పుడు ఆ మాటలు నమ్మలేదు. కానీ ఓ రోజు అమ్మ నా మాజీ భార్య, సోదరి భర్తను రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకుంది. దీంతో రెండు కుంటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. అప్పడే ఆమెకు విడాకులిచ్చాను” అని చెప్పుకొచ్చారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus