Raj Tarun: హీరో రాజ్ తరుణ్ పరిస్థితి ఇంత దారుణమా?

  • March 20, 2022 / 07:48 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న హీరోలలో రాజ్ తరుణ్ ఒకరు. ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రాజ్ తరుణ్ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత సినిమా చూపిస్త మావ సినిమాతో రాజ్ తరుణ్ ఖాతాలో మరో హిట్ చేరింది. రాజ్ తరుణ్ నటించిన కుమారి 21ఎఫ్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Click Here To Watch NEW Trailer

రాజ్ తరుణ్ వరుసగా విజయాలను సొంతం చేసుకోవడంతో నిర్మాతలు రాజ్ తరుణ్ తో సినిమాలు చేయడానికి క్యూ కట్టారు. వరుస విజయాల వల్ల రాజ్ తరుణ్ రెమ్యునరేషన్ సైతం పెరిగింది. అయితే ఆ తర్వాత రోజుల్లో వరుస విజయాలను సొంతం చేసుకోవడంలో రాజ్ తరుణ్ ఫెయిలయ్యారు. ఈడోరకం ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలతో యావరేజ్ రిజల్ట్స్ ను అందుకున్న రాజ్ తరుణ్ ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ఢీలా పడ్డారు.

రాజ్ తరుణ్ నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అంధగాడు, రంగుల రాట్నం, రాజుగాడు, లవర్, ఇద్దరి లోకం ఒకటే, ఒరేజ్ బుజ్జిగా, పవర్ ప్లే, అనుభవించు రాజా, స్టాండప్ రాహుల్ సినిమాలతో వరుసగా తొమ్మిది ఫ్లాపులు రాజ్ తరుణ్ ఖాతాలో చేరాయి. రాజ్ తరుణ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బాక్సాఫీస్ వద్ద స్టాండప్ రాహుల్ సినిమా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. స్టాండప్ రాహుల్ సినిమాకు క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు రావడంతో ఈ సినిమా పుంజుకునే పరిస్థితులు కనిపించడం లేదు. రాజ్ తరుణ్ కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో మారాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజ్ తరుణ్ కొత్త సినిమాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. రాజ్ తరుణ్ ఇకనైనా కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus