రాజ్ తరుణ్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్!

పరిగెత్తి పాలుతాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అని నమ్మే అతి తక్కువమంది కథానాయకుల్లో రాజ్ తరుణ్ ఒకడు. సక్సెస్ వచ్చింది కదా అని వరుసబెట్టి సినిమాలు చేసేయకుండా తన ఇమేజ్ కు, మార్కెట్ కు తగ్గ సినిమాలు చేస్తూ యువ కథానాయకుల జాబితాలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకొన్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ కు మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇవి కాకుండా మరో సినిమా సైన్ చేశాడు, 2014లో “అలా ఎలా” అనే సినిమాతో డీసెంట్ హిట్ అందుకొని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయిన అనీష్ కృష్ణ దర్శకత్వంలో సినిమా అంగీకరించాడు రాజ్ తరుణ్.

దిల్ రాజు నిర్మించనున్న ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ కు “లవర్” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. నేడు లాంఛనంగా మొదలవ్వనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. ఇకపోతే.. రాజ్ తరుణ్ నటించిన మరో రేసీ ఎంటర్ టైనర్ “రాజుగాడు” జనవరిలో విడుదలకానుంది. సంజనరెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఏ.కె.ఎంటర్టైనెంట్స్ సంస్థ నిర్మించింది. సో వరుస సినిమాలతో మాంచి ఫామ్ లో రాజ్ తరుణ్ కి ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో నటించే అవకాశం లభించడంతో ఇక మనోడు కూడా నాని, శర్వాల రేంజ్ కి రావడానికి ఎక్కువ టైమ్ పట్టదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus