ఆ హీరోలకు సినిమా తప్ప మరో ప్రపంచం లేదు : రాజా రవీంద్ర

Advertisement

నటుడిగా పలు చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు రాజా రవీంద్ర. చిరంజీవి, మోహన బాబు, రవితేజ చిత్రాల్లో ప్రత్యేక పత్రాలు పోషించే ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తను నటించిన హీరోల గురించి వారి ప్రత్యేకతలు గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు తెలియజేసాడు. రాజా రవీంద్ర మాట్లాడుతూ.. “ప్రతీ నటులకి చిత్రపరిశ్రమ పట్ల గౌరవం ఉండాలి.. సినిమాను దైవంగా భావించాలి. అలాంటి అంకితభావంతో ఇక్కడ అడుగుపెట్టినవాళ్ళే సక్సెస్ అవుతారు .. లేదంటే ఖాళీగా ఉండిపోతారు. సినిమాను ప్రాణంగా భావించేవాళ్ళు ఎప్పటికీ ఖాళీగా ఉండరంటూ.. చిరంజీవి గారు ఓసారి నాతో చెప్పుకొచ్చారు. అప్పటి నుండీ నేను అదే అంకితభావంతో పనిచేసుకుంటూ వస్తున్నాను.

ప్రస్తుతం ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ .. నిఖిల్ .. రాజ్ తరుణ్ కూడా అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే . ముఖ్యంగా నిఖిల్ .. రాజ్ తరుణ్ కి సినిమానే ప్రపంచం అన్నట్టు జీవిస్తుంటారు. సినిమా తప్ప.. రెండో విషయాన్ని వాళ్ళు పట్టించుకోరు. సునీల్ కూడా అలాగే ఉంటాడు. ఎప్పుడూ పరభాషా చిత్రాల్ని చూస్తూ, కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే నిఖిల్,రాజ్ తరుణ్, సునీల్… వీళ్ళ ముగ్గురికీ రాజా రవీంద్ర అత్యంత సన్నిహితుడన్న సంగతి అందరికీ తెలిసిన సంగతే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus