Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది : దిల్‌రాజు

`రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది : దిల్‌రాజు

  • October 15, 2017 / 10:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

`రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది : దిల్‌రాజు

హీరో క్యారెక్టరైజేషన్‌కు త‌న‌దైన బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీతో వేరియేష‌న్ చూపించే క‌థానాయ‌కుడు మాస్ మ‌హారాజా రవితేజ‌. ఈయ‌న క‌థ‌నాయ‌కుడుగా ప‌టాస్‌, సుప్రీమ్ చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `రాజా ది గ్రేట్‌`. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్‌పై శిరీష్ నిర్మాత‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా దీపావళి సంద‌ర్బంగా అక్టోబ‌ర్ 18న విడుద‌ల కానుంది. హైద‌రాబాద్‌లో ఆదివారం ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో హీరో ర‌వితేజ‌, మెహ‌రీన్‌, దిల్‌రాజు, శిరీష్‌, అనిల్ రావిపూడి, డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సాయికార్తీక్, సినిమాటోగ్రాఫ‌ర్ మోహ‌న‌కృష్ణ‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌. శ్రీనివాస‌రెడ్డి, ర‌ఘుబాబు, సంపూర్ణేష్ బాబు, హ‌రితేజ‌, చిత్రం శ్రీను త‌దిత‌రులు పాల్గొన్నారు. నేను ఈరోజు ఈస్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం నా దర్శకులే.

మాస్ మ‌హారాజా రవితేజ మాట్లాడుతూ – ”సాయికార్తీక్‌తో పనిచేయడం ఇదే ప్రథమం. బ్రహ్మాండమైన సాంగ్స్‌ ఇచ్చాడు. అన్నీ ఎనర్జీ, కార్తీక్‌ ఎనర్జీ కలిసి సాంగ్స్‌ బాగా వచ్చాయి. అలాగే సినిమాటోగ్రాఫర్‌ అలాగే సినిమాటోగ్రాఫర్‌ మోహనకృష్ణగారితో కూడా ఈ సినిమా కోసం తొలిసారి వర్క్‌ చేశాను. ఎడిటర్‌ తమ్మిరాజు, ఫైట్‌మాస్టర్‌ వెంకట్‌ ఇలా అందరూ సినిమా కోసం బాగా కష్టపడ్డారు. ఇక నాతో పాటు చేసిన శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్‌, అలీ, రఘబాబు, చిత్రం శ్రీను, పోసాని ఇలా అందరూ గోల గోల చేసేశారు. ఎంజాయ్‌ చేస్తూ నటించాం. రాజేంద్రస్రాద్‌గారు, రాధికగారితో కలిసి పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నారు. నిర్మాతలు చాలా మంది ఉండొచ్చు. కానీ మేకర్స్‌ తక్కువ మంది ఉంటారు. దిల్‌రాజు..మంచి మేకర్‌. అతని సక్సెస్‌ చూస్తే, అతన జడ్జిమెంట్‌, టెస్ట్‌ కనపడతాయి. అలాగే శిరీష్‌తో మంచి రిలేషన్‌ ఏర్పడింది. మెహరీన్‌ అందంగా ఉంటుంది. తనకు మంచి భవిష్యత్‌ ఉంటుంది. నేను ఈరోజు ఈస్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం నా దర్శకులే. తనతో నేను ప్రేమలో పడ్డాను. కథ చెప్పిన విధానం, పద్ధతి నాకు నచ్చింది. తను చేసిన దాంట్లో నేను యాబై శాతం చేస్తే నాకు మంచి పేరొస్తుంది. తను ఈ సినిమాతో హ్యాట్రిక్‌ కొడతాడు. సినిమా బాగా వచ్చింది. కాబట్టి ప్రేక్షకులందరరూ దీపావళికి వచ్చి మాకు వినపడండి” అన్నారు. హీరోలు ముందుకొస్తేనే కొత్త క‌థ‌లు వ‌స్తాయి

చిత్ర స‌మ‌ర్ప‌కుడు దిల్‌రాజు మాట్లాడుతూ – ”సినిమాటోగ్రాఫర్‌ మోహనకృష్ణగారు, ఎడిటర్‌ తమ్మిరాజుగారు వంటి మంచి టెక్నిషియన్స్‌తో ఈ సినిమాకు పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక సాయికార్తీక్‌ మ్యూజిక్‌ గురించి చెప్పాలంటే..ఈ సినిమాతో తన కెరీర్‌లోనే వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఆల్బమ్‌ ఇచ్చారు. అలాగే మిగిలిన టెక్నిషియన్స్‌ అందరికీ థాంక్స్‌. ఇక రాజేంప్రసాద్‌గారు, ప్రకాష్‌ రాజ్‌గారు, రాధికగారు అందరికీ థాంక్స్‌. రవితేజతో నాకు ఇరవైయేళ్ల పరిచయం. ఆర్య సినిమా స్క్రిప్ట్‌ ముందు తనకే నెరేట్‌ చేశాం. ‘కథ బావుంది..నాకు కరెక్ట్‌ కాదు, ఇంకేవరితోనైనా ట్రై చేయండ’ి అని అన్నాడు. చివరికి ఆ కథ బన్నికి వెళ్లింది. ఇక రాజాది గ్రేట్‌ సినిమా విషయానికి వస్తే..హీరో బ్లైండ్‌పర్సన్‌ అని చెబితే, అందరూ హీరోకు కళ్లు వస్తాయా? ఇంటర్వెల్‌ తర్వాత కళ్ళు వస్తాయా? అని అడిగారు. సినిమా మొత్తం హీరో బ్లైండ్‌గానే కనపడతాడని నేను చెప్పగానే..తెలుగు సినిమాలో హీరో మొత్తం బ్లైండ్‌ క్యారెక్టర్‌ చేస్తే వర్కవుట్‌ అవుతుందా? ఇలాంటి రక రకాల డౌట్స్‌ వచ్చాయి. ఈ కథ చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లింది. రవితేజకు ఈ కథ రాసిపెట్టి ఉంది కాబట్టే ఆయన దగ్గరకు ఈ కథ వెళ్లింది. అనిల్‌ ఐడియా చెప్పినప్పటి నుండి ఓ కసితో స్క్రిప్ట్‌ రెడీ చేశాడు. ‘ఏ సినిమా చేసినా ఓ కొత్త పాయింట్‌ ఆలోచించుకుని కథను తయారు చెయ్‌’ అని నేను తనకు చెప్పాను. తను ఈ సినిమా పాయింట్‌ చెప్పగానే నాకు బాగా నచ్చింది. డెవలప్‌ చేయమని చెప్పాను. ఈ స్క్రిప్ట్‌ వినగానే రవితేజ కూడా ఫోన్‌ చేసి..’రాజు..అనిల్‌ ఇరగొట్టాడు. ఈ సినిమా నేను చేస్తున్నాను’ అన్నారు. సినిమా మొత్తం చూశాక చాలా కాన్ఫిడెన్స్‌ వచ్చింది. ఈ సంవత్సరం మా సంస్థకు వరుస సక్సెస్‌లు వచ్చాయి. మొన్నటి వరకు నేను ఈ సినిమా విషయంలో ఓ టెన్షన్‌కు లోనయ్యాను. నిన్న కాపీ చూసిన తర్వాత ఐదో బాల్‌ కూడా సిక్సర్‌ కొట్టేశామని అనిల్‌తో చెప్పాను. ఈ సినిమా కోసం పనిచేసిన వారే సినిమా ఏరియాస్‌ కొనేసుకోవడం విశేషం. ఇడియట్‌ రవితేజ కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ పెర్ఫామెన్స్‌, బెస్ట్‌ ఫిలిం. తర్వాత విక్రమార్కుడు సినిమా బెస్ట్‌. తర్వాత ది బెస్ట్‌ ఫిలిం, బెస్ట్‌ ఫెర్ఫామెన్స్‌ మూవీ రాజా ది గ్రేట్‌. కమర్షియల్‌ సినిమాగా సినిమా తీస్తున్నప్పుడు అదేదైనా కొత్తగా రావాలంటే హీరోతోనే సాధ్యం. హీరో ముందుకొస్తే కొత్త కథలొస్తాయ్‌, కొత్త కాన్సెప్ట్‌లొస్తాయ్‌ అని రవి ప్రూవ్‌ చేశాడు” అన్నారు. సినిమా చూసి అంద‌రూ ర‌వితేజ ది గ్రేట్ అంటారు

డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ – ”సుప్రీమ్‌ తర్వాత తరువాత చేయబోయే ప్రాజెక్ట్‌ ఎలా ఉండాలని దిల్‌రాజుగారితో డిస్కస్‌ చేశాను. అప్పుడు ఏదైనా కొత్త పాయింట్‌తో సినిమా చేయమని ఆయన అన్నారు. తర్వాత రోజే ఆయనకు ఓ బ్లైండ్‌ క్యారెక్టర్‌తోనే సినిమా చేద్దామని అన్నాను. ఆయన కూడా పాయింట్‌ విని ఎగ్జయిట్‌ అయ్యారు. కథ రవితేజగారి వద్దకు వెళ్లిన తర్వాత ఆయన ఎనర్జీ లెవల్స్‌కు తగ్గట్లు ఆయన క్యారెక్టరైజేషన్‌ మారిపోయింది. ఆయన కారణంగానే ‘రాజా ది గ్రేట్‌’ నెక్స్‌ట్‌ లెవల్‌కు వెళ్లింది. ఈ సినిమా చూసిన తర్వాత రవితేజ ది గ్రేట్‌ అని ఆడియెన్స్‌ అంటారు. ఆయనిచ్చిన పెర్ఫామెన్స్‌, యాట్యిట్యూడ్‌, ఎనర్జీ లెవల్స్‌తో నేను మాటలు రాని వాడినయ్యాను. ఈ సినిమాను నేను ఇంత గొప్పగా చేయడానికి కారణం దిల్‌రాజు, శిరీష్‌గారే కారణం. అంత స్వేచ్ఛనిచ్చి నాతో వారు సినిమా చేయించారు. ప్రతి డైరెక్టర్‌కు ఓ సినిమా చేస్తున్నప్పుడు తన కెరీర్‌లో ఆ సినిమా గొప్ప సినిమా అవుతుందనే లక్షణాలు కనపడతాయి. ఈ సినిమాకు నాకు అలాంటి లక్షణాలు కనపడుతున్నాయి. సినిమాటోగ్రాఫర్‌ మోహనకృష్ణగారు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాయికార్తీక్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ప్రకాష్‌గారు, ఫైట్స్‌ వెంకట్‌ సహా టెక్నికల్‌ టీంకంతా థాంక్స్‌. ప్రకాష్‌రాజ్‌గారు, రాధికగారు, రాజేంద్రప్రసాద్‌గారికి నా స్పెషల్‌ థాంక్స్‌. సెకండాఫ్‌లో ఓ సాంగ్‌ మూవీకే స్పెషల్‌గా నిలుస్తుంది. ఆ సాంగ్‌ను 16వ తేది రిలీజ్‌ చేస్తున్నాం. మెహరీన్‌కు ఈ సినిమా హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది. సినిమా మెయిన్‌ పాయింట్‌ అంతా ఆ అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది” అన్నారు. ర‌విజ‌తేజ లాంటి క‌మ‌ర్షియ‌ల్ హీరో ఇలాంటి పాత్ర చేయ‌డం అభినంద‌నీయం

డా.రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ” ఏ యాక్టర్‌కైనా డిఫరెంట్‌రోల్స్‌ చేయాలనే ఉంటుంది. ముఖ్యంగా అద్భుతమైన మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న కమర్షియల్‌ హీరో రవితేజ ఇలాటి డిఫరెంట్‌ రోల్‌ను చేయడం గొప్ప విషయం..అభినందనీయం. ఈ సినిమా తర్వాత రవితేజ గొప్ప నటుడు అని కచ్చితంగా అంటారు. అనిల్‌లాంటి దర్శకులు చక్కటి పాత్రల్ని స ష్టిస్తున్నారు” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Dil Raju
  • #mehreen
  • #raja the great movie
  • #Ravi teja

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

2 hours ago
Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

3 hours ago
Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

7 hours ago
Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

8 hours ago
Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Patrick Hewes Stewart: సీనియర్‌ నటుడు కన్నుమూత.. 18 ఏళ్ల వయసు నుండి నటుడిగా..

Patrick Hewes Stewart: సీనియర్‌ నటుడు కన్నుమూత.. 18 ఏళ్ల వయసు నుండి నటుడిగా..

5 hours ago
Ramayana: హర్ట్‌ అవ్వొద్దు బాస్‌.. ఇది ‘రామాయణ’ కాదు.. ‘రావణాయణ’

Ramayana: హర్ట్‌ అవ్వొద్దు బాస్‌.. ఇది ‘రామాయణ’ కాదు.. ‘రావణాయణ’

6 hours ago
‘డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమా అవుతుంది : దర్శకుడు శేఖర్ కమ్ముల

‘డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమా అవుతుంది : దర్శకుడు శేఖర్ కమ్ముల

8 hours ago
Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

1 day ago
Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version