రాజమౌళి సినిమాలు ఎంత కాన్ఫిడెంట్ గా తీస్తాడో.. ఆయన మాటలు కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉంటాయి. కానీ గమ్మత్తు ఏంటంటే..రాజమౌళి ఒక్కోసారి ఏమి చేయలేను అంటాడో.. అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ అదే చేస్తుంటాడు. ఇది ఈ మధ్యనే రెండు సార్లు ప్రూవ్ అయ్యింది. మొన్ననే ‘రాధే శ్యామ్’ ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ ను ఇంటర్వ్యూ చేసాడు రాజమౌళి. ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్.. ‘వర్షం’ రోజులని గుర్తుచేసుకున్నాడు.
ఆ సినిమాని చూసిన రాజమౌళి.. ప్రభాస్ తో ‘ ఓ హీరో హీరోయిన్ వెనుకాల ప్రేమ ప్రేమ అంటూ ఎలా పడతాడు. నా సినిమాల్లో అయితే అలాంటివి అస్సలు పెట్టలేను’ అని అన్నాడట. కట్ చేస్తే ‘మగధీర’ సినిమాలో రాంచరణ్… కాజల్ వెంట పడుతున్నట్టు చేసాడు రాజమౌళి. మరి అప్పుడు నువ్వు అన్న మాటేంటి అని ప్రభాస్ అడిగితే.. ‘నువ్వు చెడగొట్టావ్’ అంటూ ప్రభాస్ పై తోసేసాడు. తాజాగా ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్లలో పాల్గొన్న రాజమౌళికి అలాంటి ప్రశ్న మరొకటి ఎదురైంది.
‘మగధీర’ టైములో ఇలాంటి బిగ్ బడ్జెట్ మూవీస్ నేను హ్యాండిల్ చేయలేను.భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టుల జోలికి వెళ్ళను అంటూ రాజమౌళి చెప్పాడు. తర్వాత ‘మర్యాదరామన్న’ ‘ఈగ’ వంటి స్మాల్ స్కేల్ మూవీస్ చేసాడు. కానీ అటు తర్వాత ‘మగధీర’ ని మించి ‘బాహుబలి'(సిరీస్) చేసాడు. ఇప్పుడు దానిని మించి ‘ఆర్.ఆర్.ఆర్’ చేసాడు. ‘దీనికి మీ స్పందన ఏంటి?’ అంటూ ఓ విలేఖరి రాజమౌళిని ప్రశ్నించాడు.
దానికి రాజమౌళి.. ‘ఆ టైములో రాంగోపాల్ వర్మని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అబద్దం చెప్పాను’ అంటూ సింపుల్ గా మాట దాటేశాడు. ఇలా అప్పుడు ప్రభాస్ పైకి ఇప్పుడు ఆర్జీవీ పైకి తోసేసి తెలివిగా తప్పించుకున్నాడు రాజమౌళి.