Rajamouli: ఆమిర్ ఓవర్ యాక్షన్ చేశాడని రాజమౌళి ముందే చెప్పాడట!

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నుండి గత ఏడాది వచ్చిన ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. నాగ చైతన్య బాలీవుడ్లో నటించిన మొదటి సినిమా ఇది. ‘ఫారెస్ట్ గంప్’ అనే హాలీవుడ్ సినిమాకి రీమేక్ గా రూపొందిన మూవీ ఇది. ఆమిర్ ఖాన్ కూడా ఓ నిర్మాతగా తెరకెక్కిన మూవీ ఇది. అద్వైత్ చందన్ దర్శకుడు. ఈ చిత్రంలో అంగవైకల్యం కలిగిన ఓ కుర్రాడిగా ఆమిర్ ఖాన్ నటించాడు. అతను ప్రెసిడెంట్ మెడల్ తీసుకునే స్థాయికి వెళ్లినా..

అతని మానసిక స్థితి సరిగ్గా లేనట్టు కనిపిస్తాడు. తెలుగులో ఈ చిత్రాన్ని చిరంజీవి, నాగార్జున, రాజమౌళి వంటి వారు ప్రమోట్ చేశారు. అయినప్పటికీ తెలుగులో కూడా మినిమమ్ ఓపెనింగ్స్ ను రాబట్టలేకపోయింది ఈ చిత్రం. అన్నీ ఎలా ఉన్నా.. ఈ సినిమాలో ఆమిర్ నటన కొత్తగా లేకపోగా విసిగించింది అని కొందరు విమర్శించారు. ఇదే విషయాన్ని రాజమౌళి కూడా ఆమిర్ కి నేరుగానే చెప్పాడట.

ఆమిర్ కజిన్ అయిన దర్శకుడు మన్సూర్ ఖాన్ ఈ విషయాన్ని వెల్లడించాడు.వాస్తవానికి ‘లాల్ సింగ్ చడ్డా’ లో ఆమిర్ నటన ఓవర్ గా ఉందని అతను కూడా చెప్పాడట. ‘నువ్వు ఓవర్ యాక్షన్ చేసావని’ నువ్వు నాతో అన్నప్పుడు .. ‘నువ్వు మరీ ఎక్కువగా అబ్సర్వ్ చేస్తావు కాబట్టి అలా అనిపించి ఉంటుంది అని అనుకున్నాను.

కానీ రాజమౌళి (Rajamouli) కూడా అదే అన్నాడు. ‘మీరు కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపించింది’ అని అతను చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు. అతనికి కూడా అలాగే అనిపించిందంటే నేను నిజంగానే ఓవర్ యాక్షన్ చేసి ఉండొచ్చు’ అని ఆమిర్.. మన్సూర్ ఖాన్ తో అన్నాడట.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus