Rajamouli, Mahesh Babu: రాజమౌళి మహేష్ కు విషెస్ చెప్పలేదంటున్న ఫ్యాన్స్.. అసలేమైందంటే?

మహేష్ (Mahesh Babu)   రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటికే లుక్ మార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే మహేష్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ జక్కన్న కాంబో మూవీకి సంబంధించి ఏదైనా అప్ డేట్ వస్తుందని భావించిన అభిమానులు చివరకు నిరాశకు గురయ్యారు. అయితే మహేష్ కు జక్కన్న పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా రాజమౌళి సోషల్ మీడియా ద్వారానే మహేష్ కు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం లేదని ఫోన్ కాల్ ద్వారా కూడా చెప్పి ఉండవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Rajamouli, Mahesh Babu

ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ రాజమౌళి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని రాదని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. మహేష్ బాబు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ దాదాపుగా రెండు సంవత్సరాల పాటు షూటింగ్ ను జరుపుకొనే అవకాశాలు అయితే ఉన్నాయి.

మహేష్ జక్కన్న కాంబో మూవీ 1000 కోట్ల రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్ డేట్స్ ఇవ్వనున్నారని భోగట్టా. రాజమౌళి మహేష్ కాంబో మూవీ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

రాజమౌళి గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి మహేష్ కోసం అద్భుతమైన కథ సిద్ధం చేశారని లొకేషన్స్ కూడా ఇప్పటికే ఫైనల్ అయ్యాయని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

నంగా కిరణ్ అబ్బవరం- రహస్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus