‘బాహుబలి’ సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ చిత్రంలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ , అల్లూరి సీతారామ రాజు గా రాంచరణ్ వంటి స్టార్ హీరోలు నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్ర ఖని వంటి వారు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని జూలై 30 న విడుదల చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ డేట్ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజుకి మారినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
ఇది పక్కన పెడితే… ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కోసం నిర్మాత దానయ్య ఏకంగా 400 కోట్లు బడ్జెట్ ను కేటాయించారు. అయితే ఇప్పుడు అది 450 కోట్లకు చేరినట్టు తెలుస్తుంది. ఒక్క క్లైమాక్స్ కోసమే 150 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ క్లైమాక్స్ పార్ట్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా పోరాట సన్నివేశాలతో కూడిన క్లైమాక్స్ ఇదని తెలుస్తుంది.