Rajamouli: అనిల్ రావిపూడి పై రాజమౌళి ఫన్నీ సెటైర్లు

  • May 2, 2024 / 07:23 PM IST

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ (Satyadev) హీరోగా వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వంలో ‘కృష్ణమ్మ’ (Krishnamma) అనే సినిమా రూపొందింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘అరుణాచల క్రియేషన్స్’ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. వాస్తవానికి మే 3 నే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మే 10న రిలీజ్ చేయబోతున్నారు. ప్రమోషన్లలో భాగంగా నిన్న ట్రైలర్ లాంచ్ తో పాటు ప్రీ రిలీజ్ వేడుకని కూడా నిర్వహించారు మేకర్స్.

ఈ వేడుకకి కొరటాల శివ (Koratala Siva), రాజమౌళి (SS Rajamouli), అనిల్ రావిపూడి (Anil Ravipudi) , గోపీచంద్ మలినేని (Gopichand Malineni) వంటి స్టార్ డైరెక్టర్లు అందరూ హాజరవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ క్రమంలో అనిల్ రావిపూడి, రాజమౌళి..ల మధ్య ఓ ఫన్నీ కాన్వర్జేషన్ చోటు చేసుకుంది. అనిల్ రావిపూడి స్పీచ్ ఇస్తూ చివర్లో.. ‘రాజమౌళి గారి నెక్స్ట్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వాలని కోరాడు. కథ పై కూడా హింట్ ఇవ్వాలని’ జతచేశాడు. మరోపక్క రాజమౌళి స్పీచ్ ఇస్తూ చివర్లో..

‘ఎవరైనా సరే ఇద్దరు… ఒకరు కెమెరా పట్టుకుని ఇంకొకరు అనిల్ రావిపూడిపై ముసుగేసి కొట్టేస్తే వాళ్లకు పది వేలు ఇస్తాను’ అంటూ అనిల్ రావిపూడి పై ఫన్నీ సెటైర్ వేశాడు. దీనికి అనిల్ రావిపూడి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ హైలెట్ గా నిలిచాయి. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. ‘ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్స్ అయినప్పటికీ.. రాజమౌళి, అనిల్ రావిపూడిల్లో కూడా గొప్ప నటులు ఉన్నారని’ సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus