రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీపై ఉన్న అనుమానాలెన్నో. ఈ మూవీ టైటిల్ లోగో మోషన్ పోస్టర్ అలాగే భీమ్ ఫర్ రామరాజు వీడియో బయటికి వచ్చాక ఈ సందేహాలు మరింత పెరిగిపోయాయి. అసలు రెండు ప్రాంతాలు, నేపధ్యాలు కలిగిన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజులు ఎలా కలిశారు, అది ఎలా సాధ్యం అయ్యిందనే సందేహాలు అందరి మదిలో మెదులుతూనే ఉన్నాయి.
ఐతే ఓ తాజా ఇంటర్యూలో రాజమౌళి చూచాయిగా ఆర్ ఆర్ ఆర్ కథ గురించి హింట్ ఇచ్చారు. ప్రముఖ క్రిటిక్ రాజీవ్ మసంద్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రాజమౌళి ఆయన ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్పుకొచ్చారు. ఆర్ ఆర్ ఆర్ అనేది ఓ ఫిక్షనల్ స్టోరీ.. వాస్తవంగా చరిత్రలో భీమ్, అల్లూరి కలిసింది లేదు. ఐతే ఉద్యమ వీరులైన ఈ ఇద్దరి జీవితాలలో కొన్ని సారూప్యతలు ఉన్నాయి.
వీరిద్దరూ టీనేజ్ లో ఇంటి నుండి పారిపోవడం జరిగింది. అలాగే ఇద్దరు బ్రిటిష్ వారిపై, నవాబులపై యుద్ధం సాగించడం జరిగింది. కాబట్టి వారి జీవితంలో జరిగిన పోలికలను తీసుకొని దానికి ఫిక్షన్ జోడించి అల్లిన కథే ఆర్ ఆర్ ఆర్. ఇద్దరు మిత్రులు 1920లో ఎలా ఉద్యమం సాగించారు అనేది ప్రధానంగా సాగుతుంది అని కథలోని అసలు మెలిక చెప్పేశాడు. కాబట్టి ఎన్టీఆర్, చరణ్ లు మిత్రులుగా.. కలిసి చెడుపై యుద్ధం చేస్తారని అర్థం అవుతుంది.
Most Recommended Video
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్