అనుష్కకు వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి..!!

Advertisement

అరుంధతి అనుష్కకి తన శరీరాన్ని పాత్రకు తగినట్లుగా మార్చుకోవడం బాగా తెలుసు. బరువు పెరగడం, తగ్గడం అనేది ఆమె చేతిలోని విద్య. స్వతహాగా యోగా మాస్టర్ అయిన ఈ భామ ఆసనాలతో అందాన్ని కాపాడుకుంటూ వస్తోంది. అయితే ఈ స్వీటీ లెక్కలన్నీ సైజ్ జీరోతో తారుమారు అయ్యాయి. ఈ సినిమా కోసం ఆమె 17 కిలోల బరువు పెరిగింది. ఆ తర్వాత డైట్ పాటించి కొన్ని కిలోలు తగ్గింది.

అయితే బాహుబలి – ది బిగినింగ్ లో కనిపించిన దేవసేన పాత్రలో ఇమిడి పోవాలంటే మరికొన్ని కిలోలు తగ్గాల్సి ఉంది. ప్రస్తుతం బాహుబలి – కంక్లూజన్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీ లో వేసిన భారీ సెట్స్ లో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ పోరాటంలో దేవసేన కూడా పాల్గొనాలి. కానీ అనుష్క అందుకు సిద్ధం కాలేక పోవడంతో దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళికి కోపం వచ్చింది. ఇంకా ఎన్ని రోజులు టైం తీసుకుంటావని ఆగ్రహంతో అడిగినట్లు తెలిసింది. ఏమి చేస్తావో తెలియదు మరో నెల రోజుల్లో షూటింగ్ లో పాల్గొనాలని ఆర్డర్ వేశారంట.

యోగా ను నమ్ముకుంటే బరువు తగ్గవని, లైపో చేయించుకోమని సలహా కూడా ఇచ్చారని సమాచారం. బరువు తగ్గడానికి కష్టపడుతున్నా, ఆ విషయం పట్టించుకోకుండా జక్కన్న వార్నింగ్ ఇవ్వడం పై స్వీటీ తెగ బాధ పడిపోతోందని, సీరియస్ గా డైట్, వర్కౌట్ పై దృష్టి పెట్టి వీర నారిగా కనిపించేందుకు కష్టపడుతున్నట్లు అనుష్క సన్నిహితులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus