Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » VARANASI: రాజమౌళికి అసలైన పరీక్ష.. ‘వారణాసి’ గ్లోబల్ మోజులో పడితే కష్టమే!

VARANASI: రాజమౌళికి అసలైన పరీక్ష.. ‘వారణాసి’ గ్లోబల్ మోజులో పడితే కష్టమే!

  • November 19, 2025 / 08:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

VARANASI: రాజమౌళికి అసలైన పరీక్ష.. ‘వారణాసి’ గ్లోబల్ మోజులో పడితే కష్టమే!

జక్కన్న ఇండియన్ సినిమా గర్వించదగ్గ దర్శకుడే. మార్కెటింగ్ మ్యాజిక్ ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే. కానీ ఇప్పుడు ‘వారణాసి’ విషయంలో ఆయన చేస్తున్న ప్రయోగం వెనుక ఒక చిన్న ప్రమాద ఘంటిక వినిపిస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ విజయాలతో రాజమౌళి గ్లోబల్ ఐకాన్ అయ్యారు కానీ, గ్రౌండ్ లెవల్ రియాలిటీ వేరేలా ఉంది. ఆయనకు అసలైన బలం, బలగం ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులే అనేది కాదనలేని సత్యం.

VARANASI

దీనికి నిదర్శనమే రీసెంట్‌గా నార్త్ అమెరికాలో ‘బాహుబలి’ రీ రిలీజ్ కలెక్షన్స్. తెలుగు వెర్షన్ అక్కడ దాదాపు మిలియన్ డాలర్ల దగ్గరకు వెళితే, తమిళ, మలయాళ వెర్షన్లు కనీసం వందల డాలర్లు కూడా రాబట్టలేకపోయాయి. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే.. సోషల్ మీడియాలో జక్కన్నను పొగిడేవాళ్లు వేరు, థియేటర్లో టికెట్ కొని సినిమాను బతికించేవాళ్లు వేరు. రాజమౌళిని గుండెల్లో పెట్టుకుంది మనమే తప్ప, పక్క రాష్ట్రాల వాళ్లు ఆయన్ను కేవలం ఒక దర్శకుడిగానే చూస్తున్నారు.

ఇప్పుడు ‘వారణాసి’ పేరుతో మహేష్ బాబును ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కు పరిచయం చేయాలనే తపనలో, మన నేటివిటీని మిస్ అయితే మొదటికే మోసం వస్తుంది. పుష్ప, కాంతార, కేజీఎఫ్.. ఇవన్నీ లోకల్ కథలే అయినా గ్లోబల్ రేంజ్ వెళ్లాయి. కారణం అందులో ఉన్న మట్టి వాసన, ఆ ఎమోషన్. కానీ జక్కన్న ఇప్పుడు పూర్తిగా హాలీవుడ్ స్టాండర్డ్స్, విజువల్ వండర్స్ అంటూ వెళ్తే, మన వాళ్లకు కనెక్ట్ అయ్యే ఆ ‘సోల్’ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది.

పైగా రిలీజైన గ్లింప్స్ చూస్తుంటే, ఇది ఊహించదగిన కథే అనే కామెంట్స్ వస్తున్నాయి. అదే నిజమైతే అది రాంగ్ స్టెప్ అయ్యే అవకాశం ఉంది. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారు తప్ప, ఒకసారి చూసిన ప్రపంచాన్నే మళ్ళీ ఇంకోలా చూపిస్తే పెద్దగా ఆసక్తి చూపించరు. ఇప్పుడున్న టెక్నాలజీ, ఏఐ యుగంలో కేవలం గ్రాఫిక్స్ చూపించి ఆడియన్స్‌ను మెప్పించడం కష్టం, కథలో బలం ఉండాలి.

రాజమౌళికి ఇప్పుడున్న ఏకైక పోటీ ఆయనే. ప్రతి సినిమాకు తనను తాను దాటుకుంటూ వెళ్లాలి. ఈ క్రమంలో గ్లోబల్ ఆడియన్స్ కోసం పాకులాడి, తనను నమ్ముకున్న కోర్ ఆడియన్స్ (తెలుగు వాళ్లు) ఇష్టపడే ఎమోషన్స్‌ని పక్కన పెడితే మాత్రం రిజల్ట్ తేడా కొట్టే ప్రమాదం ఉంది. వేర్లు గట్టిగా ఉంటేనే చెట్టు నిలబడుతుంది.. ఈ లాజిక్ జక్కన్న మర్చిపోకూడదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Varanasi

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

20 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

15 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

18 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

18 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version