ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఏప్రిల్ 28 వ తేదీ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి వెండితెరపై లిఖించిన బాహుబలి కంక్లూజన్ సినిమాను చూసేందుకు ఈ నిరీక్షణ. అభిమానులను నిరాశపరచకుండా ఆ తేదీన బాహుబలి థియేటర్లో ఉండేలా జక్కన్న బృందం శ్రమిస్తోంది. ఈ సినిమాకి నిన్నటితో వీఎఫ్ఎక్స్ పనులన్నీ పూర్తి అయ్యాయని సమాచారం. దీంతో కీరవాణి రీరికార్డింగ్ చేయడంలో నిమగ్నమయ్యారు. చివరి నిముషంలో హడావుడి పడకుండా ఉండాలని రిలీజ్ కి రెండు వారాలకు ముందే సెన్సార్ పూర్తిచేయాలని జక్కన్న భావిస్తున్నారు.
అందుకే తమ సినిమాను తొందరగా సెన్సార్ చేయవలిసినదిగా కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులను రాజమోళి బృందం కోరినట్లు తెలిసింది. వారి వద్దకు ప్రింట్ ని వచ్చే వారమే పంపించనున్నారు. అంతకంటే ముందు సినిమా యూనిట్ సభ్యులకు సినిమాని చూపించేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.