ప్రస్తుత కాలంలో సినిమాల విషయంలో ప్రేక్షకుల అభివృద్ధి పూర్తిగా మారిపోయింది సాధారణ సినిమాలు అంటే చూడటానికి ఆసక్తి చూపటం లేదు. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు కూడా సినిమాలలో కాస్త బోల్డ్ సన్నివేశాలను పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే యువహీరో హీరోయిన్లు కూడా ఇలాంటి లిప్ లాక్, రొమాంటిక్ సన్నివేశాలలో నటించడానికి వెనకడుగు వేయడం లేదు. ఇక తాజాగా యాంకర్ సుమ కుమారుడు రోషన్ బబుల్ గమ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.
తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ కార్యక్రమానికి నాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రాజీవ్ కనకాల చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ టీజర్ కాస్త బోల్డ్ గానే ఉన్న విషయం తెలిసిందే. టీజర్ చివరిలో హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే లిప్ లాక్ సన్నివేశం గురించి రాజీవ్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కొడుకు నటించిన సినిమా గురించి రాజీవ్ (Rajeev Kanakala) మాట్లాడుతూ టీజర్ చూస్తుంటే సినిమాలో కూడా ఇంతే బాగా చేసి ఉంటావు.
టీజర్ ఆఖరి షాట్ చూసి అంటూ ఈయన కుర్రాలను ఉద్దేశించి ఏదో చెప్పబోతూ ఉండగా అంతలోపు సుమా ఇన్వాల్వ్ అవుతూ కొన్ని మాటలు మనం మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుంది రాజా పద అంటూ ఆమె సిగ్గుతో తలవంచుకొని తన భర్తను తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. రాజీవ్ మాత్రం జనరల్‌గా వాళ్లకి అనిపించింది చెప్పాను. అవును కదా? అనగా, ఆడియెన్స్ నుంచి పెద్ద అరుపులు వచ్చాయి.
దీనికి సుమ స్పందిస్తూ ఇంకా మనం ఏమేం చూడటానికి మిగిలుందో ? ఇది టీజర్ మాత్రమే అంటూ ఆమె తల కిందకు వేసి రాజీవ్ స్పీచ్‌ని ఆపే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో వైరల్ అవుతుంది. మరి హీరోగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి రోషన్ తన నటనతో ఎలా మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.