సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ‘దర్బార్’ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే రజినీ పెద్దల్లుడు ధనుశ్ తమిళనాట స్టార్ రాణిస్తున్నాడు. అక్కడి ప్రేక్షకులకి అయన పెద్ద స్టార్. ఇప్పుడు చిన్నల్లుడయిన విశాగన్ ను కూడా హీరోగా నిలబెట్టే ప్రయత్నాల్లో రజనీకాంత్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. విశాగన్ పెద్ద బిజినెస్ మేన్ గా రాణిస్తున్నప్పటికీ నటన పట్ల కూడా చాలా ఆసక్తి ఉందట.
రజనీ చిన్న కూతురు సౌందర్యతో వివాహానికి ముందే విశాగన్ ఓ సినిమాలో చేశాడు గానీ అది సరిగ్గా ఆడలేదు. దాంతో నటన పై మరింత ఇష్టం పెరిగిందని రజనీకి చెప్పాడట. దీంతో కార్తీక్ సుబ్బరాజ్ ను రజనీ పిలిపించి, విశాగన్ కోసం ఒక మంచి కథను సిద్ధం చేయమని చెప్పాడట. కోలీవుడ్లో ఉన్న యువ దర్శకుల్లో మంచి జోరుమీదున్న కార్తీక్ సుబ్బరాజ్, ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నాడని తెలుస్తుంది. కార్తీక్ సుబ్బరాజు తో పాటూ మరికొంత మంది దర్శకుల చెవిన కూడా తన చిన్నల్లుడి గురించి రజనీ ఓ మాట వేశాడని కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.