రజినికి 80 కోట్లు ఇచ్చారట!

రజినీకాంత్ హీరోగా రంజిత్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘కబాలి’. ఈ సినిమాకు విడుదల రోజు మిశ్రమ స్పందన లభించిన వసూళ్లు మాత్రం సినిమా టాక్ కు సంబంధం లేకుండా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో సినిమా దూసుకుపోతుంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా తన సత్తా చాటుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఓ ఆసక్తికర వార్త హాల్ చల్ చేస్తోంది.

నిజానికి ఈ సినిమా కోసం రజినీకాంత్ 35 కోట్ల పారితోషికం తీసుకున్నాడు. ఇక సినిమాకు భారీ లాభాలు రావడంతో అందులో షేర్ అంటే సుమారుగా 45 కోట్ల రూపాయలను రజినీకాంత్ కు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇలా ఈ ఒక్క సినిమాతో రజినికి 80 కోట్లు ముట్టజెప్పారని చెబుతున్నారు. నిజానికి ఈ సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేయడానికి కారణం రజినీనే. ఆయన స్టయిల్, యాక్షన్ చూడడానికే ప్రేక్షకులు థియేటర్ కు వెళ్తారు. అలాంటప్పుడు ఆయనకు ఆ మాత్రం ఇవ్వడం తప్పేమీ కాదని భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus