Rajinikanth: రజనీకాంత్ ఆపార్టీ నాయకులను కౌంటర్ ఇచ్చారని అంటున్న నెటిజన్లు!

  • August 9, 2023 / 11:56 PM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ ప్రజెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా “జైలర్”. ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా నటిస్తుంది . కాగా ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ అయిన అప్డేట్స్ అన్ని అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి . మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే తాజాగా జైలర్ ఆడియో విడుదల వేడుక సందర్భంగా రజనీకాంత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .

భాషతో సంబంధం లేకుండా ఆయన మాట్లాడిన మాటలు పలికించిన ఎక్స్ప్రెషన్స్ చూసి అభిమానులను ఫిదా అయిపోయారు . ఇందుకు సంబంధించిన వీడియో ప్రసెంట్ వైరల్ గా మారింది. కాగా రజనీకాంత్ నటించిన జైలర్ ఆడియో విడుదల వేడుక సందర్భంగా స్టేజిపై మాట్లాడుతూ “మొరగని కుక్క లేదు..విమర్శించని నోరు లేదు .. ఈ రెండు జరగని ఊరే లేదు ..మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి “..అని తమిళంలో చాలా గట్టిగా కూసింత ఘాటుగానే చెప్పుకొచ్చారు.

అంతేకాదు చివరలో తెలుగులో “అర్థమైందా రాజా..?” అంటూ తనదైన స్టైల్ లో చెప్పగానే ఆడిటోరియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది . అయితే ఈ వ్యాఖ్యలు రీసెంట్గా ఆయనపై వైసీపీ నాయకులు చేసిన కామెంత్స్ కి కౌంటర్ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి రజనీకాంత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

రజనీకాంత్‌ (Rajinikanth) సినిమా అంటే వసూళ్లు సునామీ సృష్టించాల్సిందే. ఏ మాత్రం పాజిటివ్‌ టాక్‌ వచ్చినా, దాన్ని ఆపటం ఎవరితరం కాదు. రజనీ కెరీర్‌లో అత్యధికంగా 2.ఓ రూ.800 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది. ఆ తర్వాత రోబో (రూ.290 కోట్లు), కబాలి (రూ.286 కోట్లు), పేట (రూ.230 కోట్లు), దర్బార్‌ (రూ.200 కోట్లు) వసూళ్లు సాధించాయి. ఇప్పుడు ‘జైలర్‌’ ఆ రికార్డులను తిరగ రాస్తుందో లేదో చూడాలి. జైలర్‌లో తమన్నా, జాకీ ష్రాఫ్‌, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌ కీలక పాత్రలు పోషించారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus