కళ్యాణ్ రామ్ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “నా నువ్వే”. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం నిజానికి మే 19న విడుదలవ్వాల్సి ఉండగా.. సెన్సాస్ పూర్తవ్వని కారణంగా మే 25కి పోస్ట్ పోన్ చేశారు. ఆ డేట్ కి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తవ్వలేదంటూ మళ్ళీ జూన్ 1కి విడుదల చేసేందుకు సన్నాహాలు చేసినప్పటికీ.. ఒక పాటకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తవ్వలేదంటూ ఏకంగా జూన్ 14కి సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఈమధ్యకాలంలో ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత కూడా ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయిన సినిమా ఇదే అనుకుంటా.
జూన్ 7న రజనీకాంత్ “కాలా” విడుదలవుతుండడంతో వేరే ఆప్షన్ లేక జూన్ 14న విడుదల చేస్తున్నారు బాగానే ఉంది కానీ.. ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ అయ్యాక ఇంతలా పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం ఏముంది?. ఇంత గ్యాప్ వచ్చాక మళ్ళీ యూనిట్ ఆ బజ్ కి రీక్రియేట్ చేయగలదా? ముఖ్యంగా బిజినెస్ సర్కిల్స్ విశ్లేషణల ప్రకారం.. “కాలా” కనుక బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందంటే.. ఆ తరువాత విడుదలవుతున్న “నా నువ్వే’పై ఆ ఎఫెక్ట్ పడడం అనేది కామన్. మరి “కాలా” నుంచి “నా నువ్వే’ తప్పించుకోగలుగుతుందా? “కాలా” లాంటి మాస్ మసాలా ఎంటర్ టైనర్ నుంచి ప్రేక్షకుల్ని “నా నువ్వే” లాంటి క్లాసిక్ లవ్ స్టోరీ వైపు మరల్చాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది నిర్మాతలకే తెలియాలి.