Rajini, Kamal: రజనీ కాంత్ వర్సెస్ కమల్ హాసన్ బాక్స్ ఆఫీస్ పోటీకి సై అంటున్న స్టార్ హీరోస్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ ఉండడం సర్వసాధారణం అయితే ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడుతూ నువ్వా నేనా అన్నట్లు ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతూ ఉంటాయి. ఇదివరకే ఎన్నోసార్లు అగ్ర హీరోల మధ్య ఇలాంటి పోటీ ఏర్పడింది.ఈ క్రమంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రజనీకాంత్ కమల్ హాసన్ మధ్య కూడా ఇలాంటి పోటీ ఏర్పడింది.

ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు వయసు పెరుగుతున్న కొద్ది వరుస సినిమాలకు కమిట్ అవుతూ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అదేవిధంగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ రమ్యకృష్ణ తమన్న హీరో హీరోయిన్లుగా జైలర్ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Kamal Haasan With Rajinikanth

ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకొని చివరి దశకు చేరుకుంది. అయితే కోలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ బరిలో ఒకేసారి విడుదల కాబోతున్నాయని తెలుస్తోంది. సుమారు 18 సంవత్సరాల క్రితం ఈ ఇద్దరు హీరోలు బాక్స్ ఆఫీస్ బరిలో పోటీకి దిగారు. ఇలా 18 సంవత్సరాల తర్వాత మరోసారి ఈ ఇద్దరు పోటీకి సై అంటున్నారు. రజనీకాంత్ కమల్ హాసన్ ఇద్దరూ కూడా 2005 వ సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ పోటీలో నిలిచారు.

రజనీకాంత్ చంద్రముఖి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా కమల్ హాసన్ ముంబై ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే అప్పట్లో రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీగా కలెక్షన్లను రాబట్టింది.తిరిగి 18 సంవత్సరాలకు మరి వీరిద్దరూ పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ విషయం గురించి క్లారిటీ రానుంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus