తన అసిస్టెంట్ గురించి ప్రపంచానికి చూపించిన రకుల్ ప్రీత్ సింగ్

నటీ నటులందరికీ స్థాయిని బట్టి.. మేనేజర్లు, అసిస్టెంట్లు ఉంటారు. ఒక్కో భాషలో ఒక్కో మేనేజర్ ని మెయింటైన్ చేసే వారు లేకపోలేదు. సినిమా అవకాశాలు, డేట్స్ సర్దుబాటు చేయడం, లోకల్ వ్యక్తులతో మాట్లాడడం వంటి పనులు చేస్తూ… సెలబ్రిటీల ఎదుగుదలలో కీలక పాత్రలు పోషిస్తుంటారు. వీరంతా తెర వెనుకే ఉంటారు. మీడియా ముందుకి అసలు రారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఇదివరకు ఎవరూ చేయనటువంటి పనిని చేసింది. తన అసిస్టెంట్ లోని ప్రతిభని ప్రపంచానికి చాటింది. తన అసిస్టెంట్ కుమార్‌ సరదాగా డ్యాన్స్ వేస్తే ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఈ వీడియో విపరీతంగా వ్యూస్ అందుకుంది. దీనిపై రకుల్ స్పందిస్తూ… ‘‘నా అసిస్టెంట్‌ కుమార్‌ ఇంత బాగా డాన్స్‌ చేయగలడని అస్సలు తెలీదు.

షూటింగ్‌ అవర్స్‌లో అతని స్టెప్స్‌ని షూట్‌ చేశారు. చాలా బాగా డ్యాన్స్ వేశారు ’’ అంటూ రకుల్‌ చెప్పింది. ఈ వీడియోకి వస్తున్న ఆదరణ చూసి సంతోషపడుతోంది. తన అసిస్టెంట్ గురించి కూడా ఇలా ఆలోచించే వారు కూడా ఉంటారా? అని రకుల్ పై సినీ విశ్లేషకులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం రకుల్ తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. రంజిత్‌ దర్శకత్వంలో కార్తీ హీరోగా రూపొందుతోన్న సినిమాలో రకుల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇక్కడే మరికొన్ని రోజులు ఉండబోతున్నారు. ఈమె తెలుగులో బాబీ దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమాలో నాగచైతన్య సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను మళ్ళీ పలకరించనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus