ఒక మూడేళ్ళ క్రితం తెలుగు తమిళ భాషల్లోని ప్రతి కథానాయకి వేశ్య పాత్ర పోషించడానికి ఉవ్విళ్లూరింది. “వేదం” సినిమాలో అనుష్క వేశ్య పాత్రలో అందాల ఆరబోతతో ఆకట్టుకొన్న తర్వాత ఆ తరహా వేశ్య పాత్రలకు డిమాండ్ భీభత్సంగా పెరిగింది. అయితే.. రాను రాను ఆ క్యారెక్టర్స్ మీద మోనాటానీ వచ్చేసింది. దాంతో హీరోయిన్లు ఆ తరహా పాత్రలు పోషించడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఈమధ్యకాలంలో ఒక స్టార్ హీరోయిన్ అలాంటి క్యారెక్టర్ చేయడం అనేది మనం చూడలేదు.
చాన్నాళ్ల తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రాస్టిట్యూట్ రోల్ ప్లే చేసింది. “మర్ జావా” అనే హిందీ సినిమా వచ్చే వారం విడుదలవుతోంది. సిద్ధార్ధ్ మల్హోత్రా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో రకుల్ ది సెకండ్ హీరోయిన్ రోల్. అయితే.. దర్శకుడు తనకు బాలీవుడ్ లో అప్పట్లో రేఖ పోషించిన వేశ్య పాత్రకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో.. ఇప్పుడు ఈ సినిమాలో తాను పోషించబోయే పాత్రకు కూడా ఆదేస్థాయి ప్రాముఖ్యత లభిస్తుందని చెప్పాడని, అందుకే తాను ఈ పాత్ర పోషించడానికి అంగీకరించానని చెప్పుకొచ్చింది. అసలే టాలీవుడ్ లో సరైన సక్సెస్ లేక ఇబ్బందిపడుతున్న రకుల్ కి ఈ బాలీవుడ్ సినిమా చాలా కీలకం.
17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!