ఈ మధ్య కాలంలో మంచి కంటెంట్..తో ఓటీటీ సంస్థలు సైతం ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఒరిజినల్ మూవీస్ లేదా సిరీస్..లను ఆడియన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా వాచ్ చేస్తున్నారు. గత వారం రోజుల నుండి ఓ వెబ్ సిరీస్ తెగ ట్రెండ్ అవుతుంది. అదే ‘ఆజాదీ 501′(Azadi 501). గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ భారీ స్మార్ట్ ఫోన్ స్కామ్ ఆధారంగా రూపొందిన సిరీస్ ఇది. క్రైమ్ అండ్ బిజినెస్ నేపథ్యంలో దర్శకుడు శివతేజ ఈ సిరీస్ ను తెరకెక్కించారు.
సాయితేజ కల్వకోట ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సిరీస్ ‘ఆహా’ ఓటీటీలో 6 ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ అవుతోంది. 2014-2018 టైం పీరియడ్లో సాగే కథ ఇది. తండ్రి మరణంతో కుటుంబ భారం మోయాల్సి వచ్చిన ఓ యువకుడు జితేంద్ర (సాయితేజ). మోసగాళ్ల చేతిలో చిక్కుకున్న తన తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన స్కూల్..ను దక్కించుకునేందుకు అతనికి చాలా డబ్బు అవసరం పడుతుంది. తక్కువ టైంలో అంత మొత్తం డబ్బుని సంపాదించేందుకు స్మార్ట్ ఫోన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు జితేంద్ర.
ఇందులో భాగంగా.. తక్కువ ధరలకు చైనా ఫోన్లను తెచ్చి ‘మేడ్ ఇన్ ఇండియా’ గా ‘ఆజాదీ 501’ పేరుతో మార్కెట్లోకి వదులుతాడు. తక్కువ టైంలోనే అతనికి మంచి లాభాలు వస్తాయి. ఈ క్రమంలో అనుకోని విధంగా అతనికి కేంద్ర మంత్రి శరత్ గోయెల్ (హర్షవర్ధన్), ఐపీఎస్ ట్రైనీ చాణక్య (శశాంక్), స్పెషల్ ఆఫీసర్ రఘురామ్ (రవివర్మ) నుండీ చిక్కులు వస్తాయి. అవేంటి.? జితేంద్ర వాటిని ఎలా సాల్వ్ చేసి.. బయటపడ్డాడు? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ వెబ్ సిరీస్ ను 6 ఎపిసోడ్లుగా రూపొందించారు.
రాజకీయ నాయకులతో, ఉన్నతాధికారులతో హీరో ఆడే మైండ్ గేమ్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అందరికీ అర్ధమయ్యే విధంగా స్క్రీన్ ప్లే ఉంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ వంటివి మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. సిరీస్ ను వీక్షించిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. అందువల్ల ‘ఆహా’ ఓటీటీలో మంచి వ్యూయర్షిప్ ను సొంతం చేసుకుంది ‘ఆజాదీ 501’ వెబ్ సిరీస్.