Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

‘ధమాకా’ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ ఖాతాలో హిట్టు పడలేదు. ఆల్మోస్ట్ 4 ఏళ్ళు అవుతుంది. ఆ తర్వాత చేసిన ‘రావణాసుర’ ‘టైగర్ నాగేశ్వరరావు’ ‘ఈగల్’ ‘మిస్టర్ బచ్చన్’ ‘మాస్ జాతర’ ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’ వంటి సినిమాలు అన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. పరాజయాలనేవి ఏ హీరోకి అయినా కామన్. ఒక్కోసారి కొంతమందికి టైమ్ కలిసిరాకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో రవితేజపై దారుణమైన ట్రోల్స్ వచ్చేలా చేశాయి ఆ సినిమాలు..!

Irumudi

వాటి ప్రభావం రవితేజ మార్కెట్ పై కూడా పడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.కాబట్టి ఇప్పుడు అతనికి ఒక మంచి హిట్టు కావాలి. అది ‘ఇరుముడి'(Irumudi) చిత్రంతో సాధ్యమవుతుంది అనేది చాలా మంది నమ్మకం. శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ చేసిన సినిమా ఇది. ప్రమోషనల్ కంటెంట్ అంతా చాలా ప్రామిసింగ్ గా ఉంది. ముఖ్యంగా జీవీ ప్రకాష్ సంగీతంలో రూపొందిన పాటలు. ‘మల్లెపూల పల్లకి’ పాటతో థియేటర్లలో వైబ్ అవుదామనుకునే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

ఇదిలా ఉండగా.. నిర్మాతలైన ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఆల్రెడీ ‘ఇరుముడి’ చిత్రాన్ని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకి అలాగే సన్నిహితులకి చూపించడం జరిగిందట. సినిమా చూసిన అనంతరం వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. ‘ఇరుముడి’ చిత్రం 2 గంటల 25 నిమిషాల నిడివి కలిగి ఉంటుందట. ఫస్ట్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో సినిమా మొదలవుతుందంటున్నారు. రవితేజ ఇంట్రో సీన్, తర్వాత వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయట.

ఆ తర్వాత మెయిన్ కథ మొదలవుతుంది అంటున్నారు. సస్పెన్స్, యాక్షన్, ఎమోషన్ అన్నీ సమపాళ్ళలో ఉన్నాయని సినిమా చూసిన వారు చెబుతున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతంలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలెట్ అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో కంటే సెకండాఫ్ స్క్రీన్ ప్లే ఇంకా ఫాస్ట్ గా ఉంటుందట. రవితేజ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు. చూడాలి మరి..! రిలీజ్ రోజున ఎలాంటి టాక్ వస్తుందో..!

ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus