విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ అనగానే అందరికీ ‘ఎఫ్ 2’ ‘ఎఫ్ 3’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి హిట్ సినిమాలు గుర్తుకొస్తాయి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో కూడా వెంకటేష్ ఒక చిన్న కేమియో చేయడం జరిగింది. ఇప్పుడు మరో సంక్రాంతి సినిమా కోసం వెంకటేష్- అనిల్ రావిపూడి చేతులు కలిపారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్లుగా కీర్తి సురేశ్, కృతి శెట్టి నటిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. అనిల్ కి సంక్రాంతి సీజన్ అంటే బాగా ఇష్టం. అతని సినిమాలు ఎక్కువ శాతం జనవరి 12నే రిలీజ్ అవుతూ ఉంటాయి. అందుకే ఈ సినిమాకి ‘జనవరి 12 విడుదల'(JANUARY 12 VIDUDALA) అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ ఓ ప్రోమో వదిలారు. దివంగత లెజెండరీ దర్శకుడు, కామెడీకి కేరాఫ్ అడ్రెస్ అయినటువంటి ఇ.వి.వి. సత్యనారాయణ గారికి ట్రిబ్యూట్ గా ఆయన శైలిని అనుకరిస్తూ ఈ ప్రోమోని కట్ చేశారు.
సినిమా టైటిల్ ఏంటి? అని హీరో వెంకటేష్, ఇతర నటీనటులు దర్శకుడు అనిల్ రావిపూడిని అడగడం.. దానికి ఆయన ‘జనవరి 12 విడుదల’ అని సమాధానం ఇవ్వడం జరిగింది. మరోవైపు ‘మేము అడిగింది రిలీజ్ డేట్ కాదు.. సినిమా టైటిల్’ అంటూ హీరో హీరోయిన్లు అడగడం మళ్ళీ మళ్ళీ ‘జనవరి 12 విడుదల’ అంటూ అనిల్ తన మార్క్ టైమింగ్ తో బదులివ్వడం ఫన్నీగా అనిపించింది. ఫైనల్ గా ‘జనవరి 12 విడుదల’ అనేది టైటిల్ అని హీరో, హీరోయిన్లు రియలైజ్ అయ్యారు.
అలాగే దీనికి ‘బావ బామ్మర్ది సౌజన్యంతో..’ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావ బావమరిదిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘జీ స్టూడియోస్’ ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ప్రోమో అయితే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :