‘భోళా శంకర్’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర'(Vishwambhara) అనే సోషియో ఫాంటసీ సినిమాలో నటించారు. ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట ఈ చిత్రానికి దర్శకుడు. 2025 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ‘గేమ్ ఛేంజర్’ కారణంగా వాయిదా వేసినట్టు చెప్పి వెనక్కినెట్టారు. ఆ తర్వాత సమ్మర్ లో రిలీజ్ అన్నారు, చిరంజీవి బర్త్ డేకి రిలీజ్ అన్నారు. తర్వాత ఒకానొక టైమ్లో 2026 సమ్మర్ కి రిలీజ్ చేస్తామని వాయిదా వేశారు.
కానీ 2026 సమ్మర్ కి కూడా రిలీజ్ చేసింది లేదు. చిరంజీవి బర్త్ డేని పురస్కరించుకొని ఆగస్టు 22కి రిలీజ్ చేస్తారేమో అని అంతా అనుకున్నారు. ఈ డేట్ కి కూడా ‘విశ్వంభర’ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కనీసం అప్డేట్ అయినా ఇస్తారా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఇటీవల ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్ జరిగింది. దానికి చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. వాస్తవానికి ‘కొరియన్ కనకరాజు’ సినిమాని నిర్మించిన వారిలో ‘విశ్వంభర’ నిర్మాతలైన ‘యూవీ క్రియెషన్స్’ వారు కూడా ఉన్నారు.
కాబట్టి ఆ ఈవెంట్లో ‘విశ్వంభర’ సినిమా అప్డేట్ ఇవ్వాల్సిన బాధ్యత అటు నిర్మాతల్లోనూ.. ఇటు చిరుపైనా ఉంది. కానీ బాబీ డైరెక్ట్ చేస్తున్న ‘మెగా 158’ వైపు దృష్టి మళ్ళించారు. చిరు బర్త్ డే రోజున ‘మెగా 158’ సినిమా టైటిల్ టీజర్ వదులుతారనే ప్రచారం కూడా గట్టిగా చేస్తున్నారు. ‘విశ్వంభర’ ఊసే లేదు. ఎన్నాళ్ళని ఆ ప్రాజెక్టుని దాస్తారు.? లేదంటే అసలు ఆ సినిమాని రిలీజ్ చేసే ఉద్దేశమే లేదా? ఈ ప్రశ్నలకి సమాధానం మేకర్స్ కే తెలియాలి. ఫ్యాన్స్ సంగతేముంది. వాళ్ళకి కూడా ‘విశ్వంభర’ పై ఇంట్రెస్ట్ లేనట్టే కనిపిస్తోంది.