ఇప్పుడే కాదు.. ఎప్పటి నుండో ఏదో ఒకటి చేసి ప్రచారంలో నిలవడం ఆయేషా ఖాన్‌కి అలవాటే. కారణాలేమైనా కావొచ్చు ఆమె మాత్రం ఇలాంటి పనులు చేస్తూనే ఉంది. ఆఖరి సినిమా చేసి, ప్రచారానికి రాకుండా సినిమా టీమ్‌కి షాకివ్వడం కూడా జరిగింది. ఇదెప్పుడు ఏ సినిమాకి అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు లేటెస్ట్ విషయానికి వస్తే.. ఎంగేజ్‌మెంట్ రింగ్ పెట్టుకుని.. ఓ వ్యక్తిని హగ్ చేసుకొని ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీంతో 23 ఏళ్లకే ఆయేషా ఖాన్ పెళ్లికి సిద్ధమైందా అంటూ ఆమె అభిమానులు, ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. కానీ ఆ ఫొటోలను పట్టి చూస్తే.. అది ఎంగేజ్‌మెంట్ ఫొటో కాదు అని అర్థమవుతోంది. బాలీవుడ్ మీడియా ప్రకారం అయితే ఆయేషా ఖాన్ నిశ్చితార్థం చేసుకోలేదు. బయటకు వచ్చిన ఫొటో ఓ జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషనల్ ఫోటో షూట్‌లోని ఓ ఫొటో అని చెప్పొచ్చు.
ఆ ఫొటోతోపాటు ఆమె A dream అని రాసుకొచ్చింది. దీంతో అందరూ ఆమెకు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. రహస్యంగా నిశ్చితార్థం చేసుకొంది అని అనుకుంటున్నారు. అయితే ఆయేషా తన క్యాప్షన్‌లో ORNAZ అనే జ్యువెలరీ బ్రాండ్‌ను ట్యాగ్ చేసింది. ఆ తర్వాత Engagement Rings, Natural Diamond ట్యాగ్స్ కూడా ఇచ్చింది. అంటే ఆ బ్రాండ్ ప్రమోషన్ ఆ ఫొటో అని చెప్పొచ్చు.
ఆయేషా సినిమాల సంగతి చూస్తే.. ‘ముఖచిత్రం’ అనే తెలుగు సినిమాతో కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత ‘ఓం భీమ్ బుష్’ అనే సినిమా చేసింది. ఆ వెంటనే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమాలో ప్రత్యేక గీతంలో నర్తించింది. ఆ తర్వాత ‘మనమే’ సినిమాలో ఓ పాత్రలో కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. ‘జాట్’లో ఓ పోలీసు కానిస్టేబుల్‌గా, ‘ధురంధర్’లో డ్యాన్సర్‌గా నర్తించి మెప్పించింది. ‘కిస్ కిస్కో ప్యార్ కరూ 2’ సినిమాతో ఆఖరిగా బాలీవుడ్‌లో కనిపించింది. ఆ తర్వాత సినిమాలేవీ చేయడం లేదు. ఇక పైన చెప్పిన ప్రమోషన్స్ స్కిప్ ఏంటి అనుకుంటున్నారా? ‘ఓం భీమ్ బుష్’లో నటించి ప్రచారానికి రాలేదులెండి.