ఆ నలుగురి గురించి చాలా తెలివిగా చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్

తెలుగులో ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. కెరియర్ మొదట్లో చిన్న హీరోలతో కలసి నటించిన ఈ భామ, ‘కిక్ 2’ , ‘బ్రుస్ లీ’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధ్రువ’, ‘స్పైడర్’ వంటి పెద్ద సినిమాల్లో వరుస అవకాశాలను సంపాదించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఈ మధ్య ఈ అమ్మడుకి తెలుగులో అవకాశాలు అనేవి తగ్గిపోయాయి. కానీ తమిళ్, హిందీ సినిమాల్లో మాత్రం అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇక బాలీవుడ్ లోకి వెళ్లిన ఆ భామ కాస్త గ్లామర్ విషయంలో డోస్ పెంచినట్లుగా కనిపిస్తుంది.

ఇక విషయంలోకి వెళితే, గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా ఉత్సవంలో రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొంది. ఇందులో భాగంగానే యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకి ఈ అమ్మడు చాలా తెలివిగా జవాబు ఇచ్చిందంటా. అయితే పరిశ్రమ అంత కూడా ఆ నలుగురి చేతిలోనే ఉందని బయట అందరు అనుకుంటున్నారు దానికి మీ సమాధానం ఏంటని అడుగగా, ఇండస్ట్రీలో వారు కొన్ని దశాబ్దాలుగా ఉంటున్నారు అందరు అలా అనుకోవడం చాలా సహజం. అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకున్నాకాని ఇండస్ట్రీకి వచ్చి ప్రూవ్ చేసుకునే స్కోప్ ఎప్పటికి ఉంటుందని, ఈ మధ్య స్టార్ గా ఎదిగిన హీరో విజయ్ దేవరకొండనే దీనికి మంచి ఉదాహరణ అంటూ చాలా తెలివిగా జవాబు చెప్పేసిందట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus