సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్

ఒక దశలో తెలుగులో టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీగా మారిన ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో కేవలం ఒకే సినిమా చేస్తోంది. అదే ఎన్టీఆర్ బయోపిక్. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో అతిలోకసుందరి శ్రీదేవిగా కనిపించనుంది. అయితే తాజాగా ఓ జాతీయ పత్రికతో మాట్లాడుతూ సంచలన ప్రకటన చేసింది. “సినిమా జయాపజయాలకు నేనెప్పుడూ బాధ్యత వహించలేదు. సినిమా ఫలితాల వెనుక నన్ను మించిన కారణాలెన్నో ఉంటాయి” అని నిర్మొహమాటంగా చెప్పింది. ఇంకా మాట్లాడుతూ “నేను నటించిన సినిమాల ఫలితాల కంటే, అవి పంచిన అనుభవాలు, వాటితో నేర్చుకున్న పాఠాలే అత్యంత విలువైనవి. సినిమా జయాపజయాలకు ముఖ్య కారణం కథ, దర్శకులే.

ఈ రెండు అంశాల్ని దృష్టిలో పెట్టుకుని నటించాలో.. వద్దో నిర్ణయించుకుంటాను. కొన్నిసార్లు కథలు,మరికొన్ని సార్లు దర్శకుల కారణంగా సినిమా చేయాలనిపిస్తుంది. కానీ వాటి రిజల్ట్‌ను మాత్రం సమానంగానే స్వీకరిస్తాను”అని రకుల్ వివరించింది. గత ఏడాది ఈ భామ నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా చేసింది. ఇందులో వీరిద్దరి జోడీ బాగా నచ్చింది. అందుకే దర్శక నిర్మాతలు ఈ జోడీని మళ్ళీ వెండితెరపై చూపించాలని అనుకుంటున్నారు. రకుల్ తెలుగులో రీ ఎంట్రీ చైతూతోనే ఉండొచ్చని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus