బాలీవుడ్ పై ఆశ చావలేదు – రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చేసిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ సాధించింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఫిలిం చేస్తున్నారు. ఈచిత్రం తర్వాత దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ చేయనున్నారు. ఈ జోరులో ఉన్న చెర్రీని ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూ చేసింది. అందులో తన బాలీవుడ్ ఎంట్రీ అనుభవం గురించి వివరించారు. ” జంజీర్ సినిమా రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ప్రవేశించాను. ఆ చిత్రం నాకు తీవ్ర నిరాశను మిగిల్చింది. హిందీలో జంజీర్ నా ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు పెట్టుకొన్నారు.

దాంతో ప్రేక్షకుల కొంత నిరాశకు గురయ్యారు” అని రామ్ చరణ్ నిర్మొహమాటంగా వెల్లడించారు. ఒక్క అపజయంతో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. మంచి కథ దొరికితే మళ్లీ హిందీ చిత్రాల్లో నటిస్తానని వెల్లడించారు. ఇక కోస్టార్ ప్రియాంక చోప్రా గురించి అడగగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.”ప్రియాంక చోప్రా అద్బుతమైన నటి. అకింతభావంతో పనిచేసే పక్కా ప్రొఫెషనల్. ఆమెతో పనిచేయడం గొప్ప అనుభూతి. మళ్లీ అవకాశం లభిస్తే ఆమెతో పనిచేయడానికి ప్రయత్నిస్తాను” అని చరణ్ అన్నారు. చరణ్ మాటలను బట్టి చూస్తుంటే బాలీవుడ్ లో హిట్ కొట్టేవరకు నిద్రపోయేటట్టు లేరని అర్ధమవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus