Ram Charan: చిరంజీవి సినిమాల్లో చరణ్ కు ఇష్టమైన సినిమా ఇదే.. ఏమైందంటే?

  • February 25, 2024 / 05:07 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. మార్చి నెల 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ కానుండగా ఆరోజే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రానుంది. అయితే చిరంజీవి సినిమాలలో రామ్ చరణ్ కు ఇష్టమైన ప్రదేశం ఏంటనే ప్రశ్న ఎదురు కాగా చరణ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిరంజీవి సినిమాలలో ఇష్టమైన సినిమా ఏదనే ప్రశ్నకు చరణ్ స్పందిస్తూ ఒక్క సినిమా పేరు చెప్పడం కష్టమని చెబుతూ మూడు సినిమాల పేర్లు చెప్పారు.

గ్యాంగ్ లీడర్, ఖైదీ, జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలు నాకు ఎంతో ఇష్టమని రామ్ చరణ్ వెల్లడించారు. రామ్ చరణ్ కు ఇష్టమైన సినిమాలే తమకు కూడా ఇష్టమని చరణ్ ఫ్యాన్స్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి వస్తున్న లీక్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. 300 కోట్ల రూపాయల కంటే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా తమిళం, హిందీ భాషల్లో సైతం అదిరిపోయే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీన్లు ఉన్నాయని సమాచారం అందుతోంది. శ్రీకాంత్, ఎస్.జె.సూర్య ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా అటు చరణ్ (Ram Charan) ఇటు శంకర్ కెరీర్ లో హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.. గేమ్ ఛేంజర్ ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి.

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus