మెగా పవర్ స్టార్ రాంచరణ్ మళ్ళీ తండ్రి కాబోతున్నారు అంటూ మొన్నామధ్య కొన్ని వార్తలు వినిపించాయి.దసరా రోజున రామ్ లీలా మైదానంలో జరిగిన రావణ దహనం వేడుకలో చరణ్, ఉపాసన పాల్గొన్నారు. ఇందులో భాగంగా చరణ్.. ఉపాసనని చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్లడం,ఉపాసన కూడా తన పొట్ట కనబడకుండా చున్నీతో కవర్ చేసుకోవడం జరిగింది. దీంతో ఉపాసన మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యింది అనే వార్తలు ఊపందుకున్నాయి. కానీ చరణ్ టీం నుండి కానీ ఉపాసన నుండి కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాకపోవడంతో అవి గాసిప్సే అని అంతా అనుకున్నారు.
కానీ కట్ చేస్తే అవే నిజమని ఈరోజుతో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఇది చర్చనీయాంశం అయ్యింది. విషయంలోకి వెళితే.. నిజంగానే రామ్ చరణ్, ఉపాసన రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. అయితే ఇన్నాళ్లు ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ గోప్యంగా ఉంచింది. ఫైనల్ గా ఈరోజు ఉపాసనకి సీమంతం వేడుకలు నిర్వహించినట్టు తెలిపి కన్ఫర్మ్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది.
ఇందులో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా సందడి చేశారు. పనిలో పనిగా ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ టీంని కూడా చిరు ఆహ్వానించినట్టు తెలుస్తుంది. హీరోయిన్ నయనతార కూడా ఈ వీడియోలో కనిపించారు. అలాగే వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి కూడా కనిపించారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉంది.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13