Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

స్నేహం గొప్పది.. అందులోనూ మా అల్లు అర్జున్‌ స్నేహం ఇంకా గొప్పది. ఆదివారం తెలుగు సినిమా మీడియాలోనే కాదు, అల్లు అర్జున్‌కి దగ్గరైన బాలీవుడ్‌ మీడియాలోనూ, కోలీవుడ్‌ మీడియాలో ఇదే చర్చ జరిగింది. దానికి కారణం బన్నీ ఫ్రెండ్‌ షిప్‌ గొప్పతనాన్ని కీర్తిస్తూ ఓ వార్త/ సమాచారం ఇటు సోషల్‌ మీడియాలో, అటు నార్మల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడమే. ఇదంతా అల్లు అర్జున్‌ – లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా నిర్మాణం గురించే.

Allu Arjun

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిర్మాణ భాగస్వాములుగా బన్నీ తన స్నేహితుల్ని కూడా చేర్చుకున్నాడు అనేది కథనం. తనతో కలసి ప్రయాణం ప్రారంభించిన వారిని, తాను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారిని తనపాటే తీసుకెళ్లే వ్యక్తే నిజమైన హీరో. ఆ హీరో మా అల్లు అర్జున్‌ అని AA23 కొత్త నిర్మాతలు గొప్ప చెప్పుకున్నారు. తన స్నేహితులు ఎస్‌కేయన్‌, శ‌ర‌త్‌ ఇప్ప‌టికే నిర్మాత‌లుగా రాణిస్తున్నారని అలా బన్నీ కొత్త సినిమాలో సందీప్ రామినేని, నటరాజ్, స్వాతి కూడా భాగమయ్యారనేది వార్త.

బన్నీ తన స్నేహితుల గురించి ఇటీవల ఎక్కువగా మాట్లాడుతూ వస్తున్నాడు. మొన్నీ మధ్య సుమారు 900 మంది ఫ్యాన్స్‌తో జరిగిన నేషనల్‌ ఫ్యాన్స్‌ మీట్‌లో కూడా పైన చెప్పిన స్నేహితుల గురించి మంచిగా చెప్పుకొచ్చాడు. తన లైఫ్‌లో వారి పాత్ర ఎంత కీలకం అనేది చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ కీలకమైన సభ్యుల్ని తన సినిమా నిర్మాణంలో భాగస్వామ్యుల్ని చేశాడు. నిజంగా స్నేహితులకు ఇది గొప్ప గౌరవమే అని చెప్పాలి. ఇలా చేయడం వల్ల బన్నీ తన స్నేహితులకు ఎంత గౌరవం ఇస్తాడు అని చెప్పడం ఆయన సన్నిహితుల ఆలోచన అనిపిస్తోంది.

అన్నట్లు బన్నీ తన సినిమా నిర్మాణంలో బంధువుల్ని, స్నేహితుల్ని కలుపుకోవడం కొత్తేమీ కాదు. ‘పుష్ప: ది రైజ్‌’ సినిమా నిర్మాణ భాగస్వామ్యులుగా తన మేనమామలను తీసుకున్నాడు. అదే ముత్తంశెట్టి మీడియా. ఇప్పుడు ఈ సినిమాకు ఫ్రెండ్స్‌ వచ్చారు. ఈ రెండుసార్లు ప్రధాన నిర్మాత మైత్రీ మూవీ మేకర్స కావడం గమనార్హం.

పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus