Ram Charan: ఫ్యాన్స్ కోసం రామ్ చరణ్ చేసిన ఈ పనికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ (Ram Charan) క్రేజ్ పరంగా టాప్ లో ఉండగా గేమ్ ఛేంజర్ (Game changer) సినిమా విడుదలైతే చరణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎన్నో రెట్లు పెరుగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు (Pawan Kalyan)  మద్దతుగా స్టార్ హీరో రామ్ చరణ్ కు పిఠాపురంకు వెళ్లారు. ఆ సమయంలో రామ్ చరణ్ కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది.

అయితే ఆ సమయంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చరణ్ గుడిలోకి వెళ్లే సమయంలో చాలామంది ఫ్యాన్స్ చరణ్ ను చుట్టుముట్టారు. కొంతమంది ఫ్యాన్స్ చరణ్ షర్ట్ ను లాగి ఆయనను ఇబ్బంది పెట్టారు. సాధారణంగా రామ్ చరణ్ స్థానంలో మరో హీరో ఉంటే ఫ్యాన్స్ పై సీరియస్ అవుతారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదనే సంగతి తెలిసిందే.

ఆ సమయంలో బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది. చరణ్ ఫ్యాన్స్ ను వెనక్కు నెట్టే ప్రయత్నం చేసినా రామ్ చరణ్ మాత్రం అభిమానులను ఏమనొద్దని సిబ్బందికి సూచించారు. తనకు ఇబ్బంది కలిగించినా ఫ్యాన్స్ విషయంలో ప్రేమగా మెలిగే మంచి గుణం రామ్ చరణ్ కు మాత్రమే ఉందని ఈ హీరోకు ఎవరూ సాటిరారని ఫ్యాన్స్ చెబుతున్నారు. చరణ్ మనస్సు బంగారం అని ఫ్యాన్స్ చెబుతున్నారు. చరణ్ లాంటి హీరోలు అరుదుగా ఉంటారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

రామ్ చరణ్ శంకర్ (Shankar) కాంబో మూవీ గేమ్ ఛేంజర్ త్వరగా విడుదల కావాలని అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సరైన సినిమాలు రిలీజ్ కాకపోవడం వల్ల ఈ మధ్య కాలంలో థియేటర్లు మూతబడుతున్న పరిస్థితి నెలకొంది. రామ్ చరణ్ వేగంగా తన సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

https://twitter.com/AlwaysAkashRC/status/1790647336093597871

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus