టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ (Ram Charan) వేగంగా సినిమాల్లో నటిస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా షూట్ మొదలై దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు ప్రచారంలోకి రాగా ఆ వార్తలకు సంబంధించిన వాస్తవాలు మాత్రం వెలుగులోకి రాలేదు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవుతుందో లేదో కూడా స్పష్టత లేదు. గేమ్ ఛేంజర్ సినిమా దిల్ రాజు (Dil Raju) బ్యానర్ లో 50వ సినిమాగా ప్రకటన వెలువడింది.
ఈ సినిమా తర్వాత ఈ బ్యానర్ లో ఏకంగా 9 సినిమాలు మొదలయ్యాయి. దిల్ రాజు బ్యానర్ లో 59వ సినిమాగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) , రవికిరణ్ కోలా (Ravi Kiran Kola) కాంబో మూవీ తెరకెక్కుతోంది. అయితే 50వ సినిమా అనే నంబర్ చరణ్ ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తుంది. గేమ్ ఛేంజర్ ఇంత ఆలస్యంగా విడుదలవుతుందనే 50వ సినిమా ఎలా అవుతుందని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ కంటే ఆలస్యంగా మొదలైన చాలా సినిమాలు షూటింగ్ ను పూర్తి చేసుకుని విడుదలవుతుండగా మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు, సాంగ్స్ లీకవుతుండటం సైతం ఫ్యాన్స్ అసహనానికి కారణమవుతోంది. గేమ్ ఛేంజర్ గ్లింప్స్, టీజర్ విషయంలో సైతం క్లారిటీ లేదు. దాదాపుగా 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో గేమ్ ఛేంజర్ తెరకెక్కుతోంది.
ఈ సినిమాకు ఇప్పటికైనా ప్రమోషన్స్ ను సరిగ్గా ప్లాన్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా ఆలస్యం కావడం వల్ల చరణ్ తర్వాత ప్రాజెక్ట్ లపై ఆ ప్రభావం పడుతోంది. గేమ్ ఛేంజర్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేసే మూవీ అవుతుందని చరణ్ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. సినిమా రిలీజ్ అంతకంతకూ ఆలస్యమైతే మాత్రం సినిమా రిజల్ట్ పై ప్రభావం పడే ఛాన్స్ ఉంది.