నక్సలైట్ లుక్ లో మెగాస్టార్?

ఈ మధ్యకాలంలో ఎన్నో పెద్ద సినిమాలకు సంబందించిన ఓ లొకేషన్ ఫోటోలు, వీడియోలు లీకవుతూనే వస్తున్నాయి. దర్శక నిర్మాతలు, యూనిట్ డైరెక్టర్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ లీక్ ల బెడద ఆగడం లేదు. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో ఫోటోలు, వీడియోలు లీకవడం మనం చూస్తూనే వస్తున్నాం. ఇక ఇప్పుడు మెగాస్టార్, కొరటాల శివకు సంబందించిన వీడియో.. అలాగే చిరు లుక్ లీకవ్వడం పెద్ద సంచలనం సృష్టిస్తుంది.

ఓ కమ్యూనిస్ట్ మాదిరి మేడలో ఎర్ర కండువా వేసుకుని మెగాస్టార్ చిరంజీవి ఈ పిక్ లో కనిపిస్తున్నారు. దీనికి సంబందించిన వీడియో కూడా లీక్ అవడం గమనార్హం. ఈ ఫోటోలు అలా సోషల్ మీడియాలో అలా రావడమే తెగ వైరల్ అయిపోయాయి. దీంతో చిత్ర యూనిట్ అలెర్ట్ అయ్యి ట్విట్టర్ లో ఈ ఫోటో, వీడియోలు కనిపిస్తే ఆ అకౌంట్ లను బ్లాక్ చేస్తుండడం మొదలు పెట్టారు. ఇక నిర్మాతలలో ఒకరైన చరణ్ కూడా యూనిట్ డైరెక్టర్ల పై మండిపడ్డారట. దీంతో ఆన్ సెట్స్ లో మరింత జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus