Ram Charan: ధూమ్4 సినిమాలో ఆ హీరోతో కలిసి చరణ్ నటిస్తారా..ఏమైందంటే?

  • December 31, 2023 / 12:40 PM IST

స్టార్ హీరో రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ 2024 సంవత్సరంలో విడుదల కానుంది. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ షూట్ 2024 సమ్మర్ లో మొదలుకానుండగా ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ధూమ్4 మూవీలో షారుఖ్ ఖాన్, చరణ్ కలిసి నటిస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. షారుఖ్ ఖాన్, రామ్ చరణ్ కాంబినేషన్ అంటే రికార్డులు బ్రేక్ కావాల్సిందేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ధూమ్4 మూవీ పాన్ ఇండియా సినిమాగా విడుదలైతే సంచలనాలు సృష్టించడం ఖాయమని చెప్పవచ్చు. 2013 సంవత్సరంలో ధూమ్3 సినిమా తెరకెక్కగా ఆ సినిమాకు సీక్వెల్ గా ధూమ్4 తెరకెక్కుతోంది. ధూమ్4 మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. షారుఖ్ ఖాన్ వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తుండగా షారుఖ్, చరణ్ కాంబో ఇండస్ట్రీని షేక్ చేసే కాంబో అవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చరణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసి ధూమ్4 సినిమాతో బిజీ కానున్నారు. రామ్ చరణ్ పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. కథల ఎంపిక విషయంలో రామ్ చరణ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ చరణ్ కెరీర్ పరంగా ముందడుగులు వేస్తున్నారు.

చరణ్ కు ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో ఇతర భాషల్లో సైతం మార్కెట్ పెరగగా చరణ్ తర్వాత సినిమాలు భాషతో సంబంధం లేకుండా సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రామ్ చరణ్ (Ram Charan) కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus