వేగంగా నిర్మాణవుతున్న చరణ్, ఉపాసనల నివాసం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసన దంపతుల కోసం ఓ అత్యాధునిక భవనం నిర్మాణమవుతోంది. జిమ్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టు వంటి అనేక వసతులు ఈ నివాసంలో ఉండనున్నాయి. ఇందులో ఉండే ఫర్నిచర్ కూడా విదేశాల నుంచి దిగుమతి అయింది. మెగాస్టార్ తనయుడు ఇల్లు కోసం ఖర్చు పెడుతున్న మొత్తం ఎంతో తెలుసా .. అక్షరాలా 80 కోట్లు.

ఇల్లు పూర్తి అయ్యేసరికి ఈ మొత్తం పెరిగే  అవకాశం ఉంది. భవనం పూర్తి స్థాయిలో సిద్దమయిన తర్వాత తండ్రి చిరంజీవి నివాసం నుంచి చెర్రీ బయటకు రానున్నారు. భార్య ఉపాసనతో కలిసి ఇందులో నివశించనున్నారు. ఈ నూతన భవనంలోకి అడుగు పెట్టిన తర్వాతే పిల్లల గురించి ఆలోచిస్తామని ఉపాసన కొన్ని రోజుల క్రితం వెల్లడించింది. మరి ఈ కొత్త ఇంట్లో గృహ ప్రవేశ కార్యక్రమ వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.

https://www.youtube.com/watch?v=Iwm3_LQACdc

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus