‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ తో డెబ్యూ ఇచ్చిన కొరటాల శివకి.. ఆ తర్వాత మంచి డిమాండ్ ఏర్పడింది. 2వ సినిమాకే రూ.10 కోట్లు పారితోషికం తీసుకునే రేంజ్ కు కొరటాల వెళ్ళాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ కి ఒక కథ చెప్పాడు. ఎన్టీఆర్ కి నచ్చినా.. ఆ టైంలో వరుస కమిట్మెంట్స్ వల్ల చేయలేను అని చెప్పి రిజెక్ట్ చేశాడు.
దీంతో రాంచరణ్ కు కథ చెప్పి లాక్ చేసుకున్నాడు కొరటాల శివ. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ ప్రాజెక్టు మొదలైంది. తమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. బండ్ల గణేష్ ఈ చిత్రానికి నిర్మాత. అయితే తర్వాత స్క్రిప్ట్ దశలో చరణ్, చిరంజీవి..లకు అనుమానాలు రావడంతో.. ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టేశారు. తర్వాత బండ్ల గణేష్ కోసం ఇదే బ్యానర్లో ‘గోవిందుడు అందరివాడేలే’ అనే సినిమా చేశాడు చరణ్. అయితే చరణ్ తో ఆగిపోయిన సినిమా.. ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమా ఒక్కటే.. అదే ‘శ్రీమంతుడు’. ఆ తర్వాత మహేష్ బాబుకి ఈ కథ చెప్పి కొన్ని మార్పులతో ఓకే చేయించుకున్నాడు కొరటాల శివ.
2015 ఆగస్టు 7న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మొదట ఈ సినిమాపై అంతగా అంచనాలు లేవు. ఎందుకంటే.. అప్పటికి మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ ‘ఆగడు’ వంటి డిజాస్టర్లతో కొంచెం డౌన్లో ఉన్నాడు. మరోపక్క ‘బాహుబలి’ సినిమా బ్లాక్ బస్టర్ రన్ ను కొనసాగిస్తుంది. అయితే మొదటి రోజే సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో… కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి.
ఫైనల్ గా మహేష్ బాబు కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ‘మగధీర’ ‘అత్తారింటికి దారేది’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల కలెక్షన్స్ ను అధిగమించి ‘బాహుబలి'(బాహుబలి ది బిగినింగ్) పక్కన నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ‘శ్రీమంతుడు’. అప్పటివరకు డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్న ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు.
Read Today's Latest
Movie News Update. Get
Filmy News LIVE Updates on FilmyFocus