ఇక్కడి స్టార్ డైరెక్టర్లను కాదని.. ఆ తమిళ డైరెక్టర్ కు ఓకే చెప్పాడట..!

‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోయేది ఓ క్లారిటీ వచ్చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా చెయ్యబోతున్నాడు. ఆ తరువాత ‘కె.జి.ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే మన చరణ్ మాత్రం ఇంకా ఏ చిత్రానికి కమిట్ అవ్వలేదు. చిరు – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రంలో గెస్ట్ రోల్ చెయ్యడానికి మాత్రమే చరణ్ ఓకే చెప్పాడు.

అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల వంటి దర్శకులు చెప్పిన స్క్రిప్ట్ లను కూడా చరణ్ విన్నాడు కానీ దేనిని లాక్ చెయ్యలేదు. దిల్ రాజు కూడా కొంతమంది దర్శకులను చరణ్ వద్దకు పంపించి స్క్రిప్ట్ లు వినిపించే ప్రయత్నం చేసాడట. కానీ వర్కౌట్ అవ్వలేదు. చరణ్ తన నెక్స్ట్ సినిమాని ఇంకా ఓకే చెయ్యకపోవడానికి గల కారణం.. ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత తాను చెయ్యబోయే చిత్రం కచ్చితంగా పాన్ ఇండియా చిత్రం అయ్యుండాలని అతను భావిస్తున్నాడట. అందుకోసమే ఏ డైరెక్టర్ కు ఓకే చెప్పలేదని తెలుస్తుంది. అయితే చరణ్ తన తరువాతి చిత్రాన్ని కచ్చితంగా ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్లోనే చెయ్యబోతున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడు మోహన్ రాజా.. యూవీ క్రియేషన్స్ వారికి ఓ కథ వినిపించాడట. అది నచ్చడంతో చరణ్ వద్దకు ఇతన్ని పంపారట. ఈ కథలో పాన్ ఇండియా ఎలిమెంట్స్ ఉండడంతో చరణ్ ఈ ప్రాజెక్టు చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం. గతంలో ఈ దర్శకుడు తమిళంలో తెరకెక్కించిన ‘తనీ ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో ‘ధృవ’ పేరుతో చరణ్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా ఆ చిత్రం మంచి విజయం సాధించింది.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus