మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రాన్ని అపజయమెరుగని దర్శకుడు కొరటాల శివ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ అనే టైటిల్ ను ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నారు. ఇక ఈ ప్రెస్టీజియస్ మూవీలో .. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు ఈ చిత్రానికి సహనిర్మాత కూడా చరణ్ పని చేస్తుండడం విశేషం. నిర్మాతలలో ఒకడైనప్పటికీ.. చెర్రీ రోజుకు కోటి రూపాయల చొప్పున పారితోషికం తీసుకుంటున్నాడు.
ఈ చిత్రానికి గానూ 30 రోజులు కాల్షీట్స్ ఇచ్చిన చరణ్… మెత్తంగా 30 కోట్ల వరకూ పారితోషికం అందుకోబోతున్నాడు. మొదట మహేష్ తో ఈ పాత్రని చేయించాలి అనుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ కొన్ని కారణాల వల్ల కుదరకపోవడంతో చరణ్ ను ఫైనల్ చేసారు. మహేష్ కు సైతం.. ఇదే మొత్తంలో రెమ్యూనరేషన్ ను ఆఫర్ చేశారు నిర్మాతలు..! ఇక ప్రస్తుతం ‘ట్రిపుల్ ఆర్’ తో బిజీగా ఉన్న రాంచరణ్… ఆ షూటింగ్ ముగిసిన వెంటనే.. ‘మెగాస్టార్ 152’ షూట్ లో జాయిన్ అవ్వనున్నాడు. అటు నిర్మాతగానూ.. ఇటు స్టార్ హీరోగానూ .. సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు మన రాంచరణ్.
Most Recommended Video
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్