మూడో స్థానంలో నిలిచిన రామ్ చరణ్ చిత్రం!

తెలుగు సినిమాలు రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తున్నాయి. టీజర్, ట్రైలర్స్, ఆడియోలు మాత్రమే కాదు సాటిలైట్ హక్కులు కూడా సినిమా పూర్తికాకముందే అమ్ముడుపోతున్నాయి. ఈ కేటగిరీలో బాహుబలి చిత్రం 25 (రెండు సినిమాలు) కోట్లు పలికి మొదటి స్థానాల్లో నిలిచింది. ఇక త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీ కి టైటిల్ ఖరారు కాకముందే శాటిలైట్ హక్కులను ఓ ఛానెల్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. 20 కోట్లు పలికినట్లు సమాచారం. ఆ తర్వాతి స్థానాన్ని రామ్ చరణ్ మూవీ సాధించడం విశేషం. సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మొదటి నుంచి ఆసక్తిగా మారింది. రామ్ చరణ్ పక్కన సమంత నటిస్తుండడం, పాతికేళ్ళనాటి కథ, చరణ్ గ్రామీణ యువకుడిగా నటిస్తుండడం వంటి అంశాలు రంగస్థలం 1985పై అంచనాలను పెంచుతున్నాయి.

అందుకే ఓ ప్రముఖ ఛానెల్ శాటిలైట్ హక్కులకోసం 18 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలిసింది. మైత్రి మూవీ మేకర్స్ వారు సంతకాలు చేయడమే తరువాయి అని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. జగపతిబాబు, అనసూయ వంటి వారు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus