గర్భవతి అయిన ఉపాసన

మెగా అభిమానులకు శుభవార్త. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో తండ్రి కాబోతున్నారు. “ఇప్పుడే నాకు పిల్లలేంటి.. నేనింకా పిల్లవాడ్ని” అని తప్పించుకు తిరుగుతున్న చెర్రీ బిడ్డని చేతుల్లో ఎత్తుకొని ఆడించే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయి. 2012 లో రామ్ చరణ్ తన బాల్య స్నేహితురాలైన ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం ఇద్దరూ ఎంజాయ్ చేయాలనీ ఉద్దేశంతో పిల్లలు ఒద్దనుకొన్నారు. పిల్లలు ఎప్పుడూ అని అడిగినప్పుడల్లా ఉపాసన, చరణ్ నవ్వుతూ దాటవేసేవారు. కానీ ఈరోజు చెర్రీ భార్య ఉపాసన గర్భవతి అని తెలిసింది.

దీంతో చిరంజీవి ఇంట ఆనందం వెల్లివిరిసింది. ఈ విషయాన్నీ మీడియాకు రామ్ చరణ్ స్వయంగా రెండు రోజుల్లో చెప్పనున్నారు. ఉపాసన, చరణ్ ఇష్టంగా 80 కోట్లతో  నిర్మించుకుంటున్న కొత్త ఇంటిలోనే వారసుడు/వారసురాలికి స్వాగతం చెప్పనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus